పుట:AndhraRachaitaluVol1.djvu/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

107

లేదు హతమయ్యె మగకూన కోటపాడయ్యె నింకేటి కిచట ' ఇది చదువుకొని కంటనీరు పెట్టుకొను రసిక శూరులు నేడు పెక్కండ్రు కలరు. శాస్త్రిగారు శ్రవ్య కావ్యము వ్రాయలే దనువెలిగతి లేదు. వీరి యీపై మూడు నాటకములలోను గొప్ప కవిత్వమున్నది. పిండిలేని వారికి వీరి కవిత యెటులుండినను, పండిత కవులకు బండువు పండితుడు కవికాడు అను వాదమిపుడు నిలువదేమో.

వేంకట రాయ శాస్త్రి గారి యఖండపాండితికి దార్కాణముగా వారి అముక్తమాల్యదా, శృంగార నైషధ వ్యాక్యలు చూప వచ్చును. అముక్తాదులలోని పాఠములు కొన్ని వీరు స్యయముగా నవరించిరి. అది కొంత వీరిలో గల లోప మనక తప్పదు. ఆముక్త వ్యాఖ్య వీరు కొన్నేండ్లు చదివి నాలుగు నెలలలో వ్రాసిస్రట. 24-6-1920 నాడు ప్రారంభించి 20-10-1920 నాటికి బూర్తి చేసిరని వారి చరిత్రము చెప్పుచున్నది. అందులకే యవరమల్లి నాధ బిరుదము వారి యెడ నన్యర్థమైనది.


శ్రీవీరేశలింగము పంతులు గారు 'విధవావివాహ ' ప్రచారము బాఢముగా జేయుచున్న సమయమున శాస్త్రులు గారు "శ్రీపునర్వివాహదుర్వాదనిర్వాపణ గ్రంధము బహు పరిశ్రమమునకు బాల్పడి బహు గ్రంధములు పరిశీలించి ప్రకటించిరి. అప్రకటనమే శాస్త్రిగారి జీవితమునకు నూత్గన ప్రకరణమైనది. వారి ప్రతిభయు బాండిత్యము లోకమునకు దెలిసినది యీఘట్టమే. పునర్వివాహవాదఖండనోపన్యానములవలననే శాస్త్రి గారికి బెక్కు మంది మదరాసు మహాశయుల మైత్రి కలిగినది. ఆవర్టు, మిల్లరు మున్నగు హౌణులకు వీరి గీర్వాణభాషా పాండిత్యము విదితమైనది. తత్ప్రతిఫలముగా 1887 నవంబరులో క్రైస్తవ కళాశాలా సంస్కృతోపాధ్యాయపదము శాస్త్రి గారికి లభించినది. ఈ యుద్యోగముతో నూరకుండక యపారమగు భారతీ సేవ గావించిరి. చెన్న పుర జీవితము శాస్త్రులు గారికి గ్రంధ రచనోత్సాహము హెచ్చించినది. 1890 లో జ్యోతిష్మతి ముద్రాలయము నెలకొలిపి కధాసరిత్సాగ