పుట:AndhraRachaitaluVol1.djvu/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

106

ప్రాణంపు బ్రాణంబువగిది నన్నోమెండు
నన్నకే తలవంపు న్యాధినైతి
ననుగోరి తన ప్రాణమునకు దెగించిన
దయితుని కే బంధధాత్రినైతి
బ్రాణనాథుని నేగొల్చి బందినైతి
దప్పులేక కుశీలవతాకనైతి
ఎదెప్పరము మాని సకి నీవ చెప్పవమ్మ
మానమేదిన వెలదికి బ్రాణమేల?


ఉత్తరోత్తర రనభావనిష్యందములగు నీమువ్వురుకవుల సీసములు నొకమాఱు చదువుకొని యభిజ్ఞలు రసతత్త్వమును జూఱలాడవలయును.


శాస్త్రిగారు నిరుపమానవర్ణనా సన్నివేశ సంధానధౌరేయులు. ఒక యెడ గాళిదాసుని దలపింతురు. ఒకయెడ భవభూతిని మఱపింతురు. అనిరుద్ధునకు స్వప్నములో బ్రియురాలు గనబడెను. ఆమెయే యుష. సఖునితో నాసంగతి చెప్పుచు స్వప్న దృష్టయగు ప్రణయిని వర్ణింప వలసి వచ్చినది. అతడు పూదోటలో నున్నాడు. అది వెన్నేలరేయి. మంచు కురియుచున్నది. అట్టి సన్నివేశమున నిటులు వర్ణన.


ఉషకై పరితపించుచున్న యనిరుద్ధున కప్పటికి దెలియకున్నను ప్రియయునుషయే యైనదట. అతి మాత్ర ప్రజ్ఞా సంపన్నులగు శాస్త్రి గారి భావనా శక్తి నీపద్య మొక్కటియే తార్కాణించు చున్నది. కనుకనే నాటక కర్త "యుషావివాహము" 'సిద్ధసుధా ప్రవాహ ' మనుకొనినాడు.


బొబ్బిలి నాటకములు మఱికొంద ఱిటీవలి కవులు కూడ వ్రాసిరి. వానియన్నింట వేంకట రాయ శాస్త్రి గారిది రసవత్తరము. 'ఆడుబురువు