పుట:AndhraRachaitaluVol1.djvu/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

105

ఈ పేరిగాడే ప్రతాపరుద్రీయములోని పేరిగాడు. శాస్త్రులుగారిచెవికింపుగా నేదేని చక్కని పలుకుబడి గాని నామవాచకముగాని వినబడినదో, అది సందర్భోచితముగ గ్రాంధికము చేయవలసినదే. ప్రతాపరుద్రీయములో వెఱ్ఱివాడు నేను కండచీమను. ఏమనుకున్నావో. పట్టుకుంటే వదలను. అనెను. శాస్త్రులుగారు విశాఖపట్టనములో నున్నపుడు పొరుగింట ముసలిమగడు పడుచుభార్యను జీటికిమాటికి నీకండ చీమ పదము నుపయోగించి తిట్టుచుండువాడట. అది జ్ఞప్తికిరాగా నిచటబ్రయోగించిరని వారి సన్నిహితులు చెప్పుడురు.

బొబ్బిలి నాటకమున నయిదవయంకములో సారాయిదుకాణము పెట్టిన వాని పేరు 'బొడ్మిన్ ' అనిరి. ఇది వీరు విశాఖపట్టనములో నున్నపుడక్కడి దుకాణదారునిపేరటే. ఇంకను నిట్టియనేక స్వానుభవములు తమ నాటకములో నుద్ఘాటించిరి. వీరికి జంగము పాటలు, పడవ పాటలు, ముష్టిపాటలు వినుటయం దాన్థపెద్దది. ప్రతాప నాటకమునకు ముఖ్యముగా బ్రఖ్యాతి గొని తెచ్చినది పాత్రోచితభాష. కవి చెప్పినటులీనాటకము 'పండితమానుల గండెనీరు ' గా నున్నది.

ఉషాచరిత్రము నెఱ్ఱాప్రెగడయు, సోమనాథుడును దమ కావ్యములలో రసోత్తరముగా జిత్రించిరి. ఎఱ్ఱన బాణుని రాక నాలోకించిన యుషచే నొక సీసము చదించినాడు. సోమ నాథుడు కలగని లేచిన యుషచే నొక సీసము పఠించినాడు. వేంకటరాయ శాస్త్రి గారి నాటకములో భ్రాంతిద్వీపమున నక్షత్ర ప్రాసాదమున బంధితయుష చెలి చిత్ర రేఖతో నిట్లనుచున్నది.

ఒడిలోన నేనులే కోలగంబుండని
తండ్రికినే బగదాననైతి
నన్ను గైనేయించి కన్నదే దినమైన
తల్లికి నే విషవల్లినైతి