పుట:AndhraRachaitaluVol1.djvu/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

గారు వేదము వేంకటరమణ శాస్త్రులవారు తమ తిత్త్రబృందములో నీకథను బ్రస్తుతించునపుడు నేనును వింటిని. వారు చెప్పుటలో నీకథ అరగంటకూడ పట్టలేదు. ఇటీవల నేను ఆంధ్రజనవినోదినీముద్రణాధి కృతుడనై యుండగా 1883 సం:న జూలై నెలలో దానిని నాటకోచితముగా రూపు చేసి, ఈ నాటకమునందలి గద్య భాగమును మాత్రము వ్రాసి నామిత్రులకు జూపితిని.

శాస్త్రిగారి తండ్రి గారికడ నలుగురు శిష్యులు వేదాంత గోష్ఠి తఱచు చేయు చుండువారట. వారిలో నొకడు బ్రాహ్మణుడు. రెండవ వాడు చాకలి, మూడవవాడు ముసల్మాను, నాలగవ వాడు క్రైస్తవుడు. వారి గోష్ఠి శాస్త్రి గారు వేడుకపడి వినుచుండువారట. ప్రతాప చరిత్రలోని మహమ్మదీయ పాత్ర మంత మనోహరముగా జిత్రింపగలుగుటకు నాటి మహమ్మదీయ శిష్యుని మాటలు వినియుండుటయే కారణమని శాస్త్రిగారు రనుచుండెడి వారని చెప్పుకొందురు.

ఈయన చోడవరము బడిలో గొన్నాళ్ళు బ్రధానోపాధ్యాయులుగా నుండిరి. నాటి యొక విచిత్రగాధ నిట్లు చెప్పుదురు. ఆబడిలో 'పేరిగాడు ' అను నొక నౌకరు యుండువాడు. బడి పనులు లేవియు ముట్టుకొనక మూడు ప్రొద్దులు 'సెక్రటరీయింటనే గృహకృత్యములు చేయుట, ఎప్పుడో వచ్చి బడియరుగుమీద బరుండుట - ఇది వాని దైనిక చర్య. మన శాస్త్రులు గారికి వీని చర్య చూడ నరకాలిమంట నెత్తికెక్కి యొక్క నాడు వీని కిదిపని కాదని యొక చింతబరికె చేతబుచ్చుకొని నపాళమంటునట్లు నాలుగు చుఱుకలు తగిలించి మెల్లగా దప్పుకొనిరట. వాడు 'మొఱ్ఱో ' అని లేచి 'సెక్రటరీ ' తో శాస్త్రులుగారి యన్యాయము చెప్పికొనెను. సెక్రటరీ శాస్త్రి గారిని రమ్మని నౌకరును పంపెను. 'మీయింటికి వచ్చు నవసరము నాకు లేదు. పనియున్నచో మీరు రావలయును.' అని శాస్త్రిగారి ప్రత్యుత్తరము. నిరంకుశాః కవయః |