పుట:AndhraRachaitaluVol1.djvu/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

103

రంగస్థలముల కెక్కికీర్తిగనినవి. ఈ నాటకములు మూడిటికిని పాత్రౌచిత్యపోషణము పెద్దవన్నె దెచ్చినది. మహానుభావము గల వేంకట రాయ శాస్త్రిగారు గ్రాంధిక గ్రామ్యములు పాత్రోచితములుగా జిత్రించి ప్రతాప రుద్రీయమునకు బేరు దెచ్చిరి. నాగానందాంధ్రీకరణమునను ప్రతాపరుద్రీయమునను వీరు క్రొత్త మార్గము త్రొక్కుట జూచి కొందరు కేవల గ్రాంధిక వాదులలు గోపకారణమైనది. విమర్శనములు వెలువడ జొచ్చినవి. అంతకుమున్నే యిది కనిపట్టి 'ప్రతాప ' లో శాస్త్రి గారిట్లు వ్రాసికొని నటిచే జదివించిరి.

అంకెకు దార్చె నేరసికు నంగలభారతి ప్రౌఢనీతి, నా
కింకిరినాంధ్రి ద్రావిడియు గేరుచు దైవియు గూడి రెవ్వనిన్
జంకు కళంకు లేని కవి చంద్రుడు తోషిత కోవిదేంద్రుడా
వేంకటరాయ శాస్త్రి కృతి వెంగలిమూక కెఱుంగ శక్యమే?

ప్రతాపరుద్రీయమున దురుష్కునిచేతను, బొబ్బిలిలో సిపాయి చేతను శాస్త్రిగారు సందర్భసుముచితమగు సంభాషణము చేయించిరి. వేంకట రాయ శాస్త్రి తండ్రి గారు వేంకటరమణ శాస్త్రి గారు సంస్కృతాంధ్రములలో గొప్ప పండితులు. వీరు పరవస్తు చిన్నయసూరికి సహపాఠులు. తండ్రి గారు పెక్కు పట్టనములలో నుద్యోగములు చేసి యుండుటచే వేంకట రాయ శాస్త్రిగారు కూడ వారితో పాటనేక మండలములలో దిరుగుట, త్తన్మండల వ్యవహార భాషాసంప్రదాయము లెఱుగుట తటస్థించినది. బాహు బాల్యముననే ప్రతాపరుద్రీయ కథ వేంకట రాయ శాస్త్రిగారి నాకర్షించినది. అది 1896 లో నాటక రూపమునకు వచ్చి యాంధ్రి కాభరణమైనది. ఈ విషయము తన్నాటకావతారికలో నిటు లున్నది. ఓరుగంటి ప్రతాపరుద్ర మహారాజును తురకలు ఢిల్లీకి ఖయిదు గొనిపోయినకథ లిఖితముగాని ముద్రితముగాని నాకెచటను దొరకలేదు. నే నెమిదేండ్లునయనున నుండగా మానాయన