పుట:AndhraRachaitaluVol1.djvu/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వేదము వేంకటరాయశాస్త్రి

1853-1929

పుదూరు ద్రావిడ బ్రాహ్మణులు. తల్లి: లక్ష్మమ్మ. తండ్రి: వేంకట రమణశాస్త్రి. పుట్టుక మదరాసులో. పూర్వుల జన్మస్థానము నెల్లూరు జిల్లా కావలి తాలూకాలోని మల్లయపాలెము. జననము: 1853 డిసెంబరు 21 తేదీ. (ప్రమాదీవి సంవత్సర మార్గశీర్ష బహుళ సప్తము బుధవారము. నిర్యాణము. 1929 జూన్ 18 తేదీ ఉదయము 5-45 ని.కు. రచిత గ్రంథములు: ప్రక్రియా ఛందస్సు, అలంకారసార సంగ్రహము 1886- ఆంధ్రకథాసరిత్సాగరము 1891 - నాగానందము 1891 - ఆంధ్రాభిజ్ఞానశాకుంతలము 1896-ప్రతాపరుద్రీయ నాటకము 1897 - ఆంధ్ర ప్రసన్నరాఘవ నాటక విమర్శనము 1898 - ఉషా నాటకము 1901 - బొబ్బిలియుద్ధ నాటకము 1916 - మాళవికాగ్ని మిత్రము 1919 - ఉత్తరరామచరిత్రాంధ్రీకరణము 1920 - విక్రమోర్వశీయ, రత్నావళి, సాహిత్య దర్పణాంధ్రీకరణములు 1921 - శారదా కాంచిక శృంగారనైషధము సర్వంకషవ్యాఖ్య 1913 - ఆముక్తమాల్యద వ్యాఖ్య 1920 - రఘువంశము, కుమారసంభవము, ఆమరు కావ్యము, విజయవిలాసము, సారంగధర, కావ్యాలంకార చూడామణి మున్నగునవి టీకలతో- 1910లో వెలువరించిరి. జనవినోదినీ పత్రిక ప్రకటించిరి.

కవి పండితుడు కాడు. పండితుడు కవి కాడు అని కొందఱి వాదము. కాళిదాసుడు కవికుల తిలకము. అతని పాండిత్వము భువనవిదితము. భవభూతి మహాకవి. అతడు పదవాక్య ప్రమాణజ్ఞానమున బేరు మోసిన వాడు. కవి పండుతుడు కాడనుటలో సొగసులేదు.

వేదము వేంకటరాయ శాస్త్రిగారు మహోపాధ్యాయులు సర్వతంత్ర స్వతంత్రులు. కళా ప్రపూర్ణులు. వ్యాఖ్యానమల్లినాథులు. వీరు వ్రాసిన పద్య కావ్యములు లేవు గాని కాళిదాస భవభూతులవలె వీరును మూడు నాటకములు రచించిరి. ఇవి మూడును మూడు రత్నములు. వానిలో ప్రతాప రుద్రీయ మనర్ఘరత్నము. ఉష, బొబ్బిలి నాటకములు రమ్యములై