పుట:AndhraRachaitaluVol1.djvu/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పాలెపు త్రిపురాన పన్నాల పూండ్ల

వారణాసి చిలంబు దుర్భ నిడమర్తి

సంద్రి సత్యవోల్ కల్లూరి బయపునేడి

జగతి శైల నాదెళ్ళ గుండు గురుజాడ

మాడభూషి కొక్కొండ సంశప్రగేయు

లోగిరాల జగన్నాథ నాగయాది

బుధులు నరదేవతాంకితములుగ జేసి

ఈమాలికలో సమకాలికుల ప్రసక్తి లెస్సగా బొందికగా ముచ్చటింప బడినది. రాజమహేంధ్రవర రాజకీయ సర్వకళాశాలధ్యాపకాస్య తముడు, సంస్కృత ప్రాకృత హూణాభాషాసామ్య వైషమ్యబోద్దయు, శాస్త్ర బ్రహ్మచార్యుసధా శుద్ధతాప్త సువర్ణ శాసనుండు, కతిపయ రూపకప్రణేతయు నగు వాసుదేవశాస్త్రిగారు ధన్యులు. ఎవరో చమత్కరించి నటులు వీరిపేరు ఆటవెలదిలో నిముడును. "నందకరాజ్య" మందలి యీక్రింది సీసము శాస్త్రులుగారి జీవితసర్వస్వ సంగ్రహమునకు నిలువుటద్దము.

తొల్లి విరోధికృత్తున జ్యేష్ట శుక్ల ద్వితీయాదివాకరతిధికి సరిగ నాన, వేయి యెనిమిదగు నూటయేబది యొకటవ యేటి జూనొకటి నాడు పుట్టి కార్మూరిలో మట్టెమువారింట మేనమామల కోర్కిమీద నట్లు చేవేండ్ర కృష్ణమ్మ శేషాచలముగార్ల యొద్దను బడిచదు వొనర జదివి మేనత్త పెదకొడుకై నట్టి యా రామలింగ శాస్త్రులవారి చెంగటను బసందుగా గాళిదానత్రయ మేమొ పఠించి యప్పకవీయ మెంచి నేర్చి కార్మూర, గుంటూర పేర్మితో నింగ్లీషు చదివి, బందర గొద్దిశాలజదివి నోబిలుస్కూలులోను బ్రవేశపుబరీక్ష ప్రథమశాస్త్ర పరీక్ష వఱకు దేలి యచట వేదుల వేంకటాచార్య వర్యుల సన్నిధిలో నాంధ్ర