పుట:AndhraRachaitaluVol1.djvu/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైనది. అటుపిమ్మట తిరుపతివేంకట కవులు కూడ దాని ననువదించిరి. వాసుదేవశాస్త్రిగారు ఉత్తర రామచరిత్రాంధ్రీకృతి 1883 లో వెలువడినది. వీరి తెలుగుసేత దాని ననేకు లనువదించిరి.

వీరి "మృచ్ఛ కటికము" తెనిగింపు మచ్చు:

తొడి బండకుండగా జనము త్రోవల నిల్చిన మింటిదీపమై

పొడమె శశాంకు డల్లడుగో బోటుల చెక్కులవోలె వెల్లనై

యుడుగణ మాశ్రయింప నిరు లుచ్చిపడన్ వెదచల్లె వెన్నెలన్

పడిలిన పంకమందు బయిపై బడు చుండెడు పాలధారగా."

" అద్వైతం సుఖదు:ఖయో రనుగత" మిత్యాదిమగు ఉత్తరరామ చరితగతశ్లోకమునకు వాసుదేవశాస్త్రి గారి తెనుగు పరివర్తనపుదీరు:

ఎవ్వనికైన జన్మమున హృచ్ఛమ లేక సుఖాసుఖంబుల

న్నవ్వుచు నొవ్వకే చెలువున స్సతతంబును రాగలబ్ధితో

జవ్వనమూడి వార్ధకము సాగగ స్నేహము మెండుకొన్న దా

మవ్వపు గోర్కి నట్టి యతిమానుష శాలికి మంగళంబగున్!

వీరి "రఘువంశము" గ్రిగ్గుదొరగారికి గురుతు గానర్పింపబడినది. చిత్రమయిన యీపద్యము చదువుడు. "ఖృష్టమత బోద్దృసూతి విశిష్టభూతి, సకలవిద్యాధికారి ప్రశస్తసూరి, ఆశ్రితావనశక్తి రాజాదృతోక్తి, లగ్గు పుడుకంగలారు శ్రీగిగ్గుగారు." వీరివ్యుత్పత్తిభారములో రచనా సౌలభ్యము కొంత మఱుగున నుండును. ఎన్నో పద్యము లిందుల కుదాహరణములు చూడవలయను. రఘువంశమును దొరగారి కంకితము నిచ్చుట యీగీతమాలలో నిటులు సమర్ధింపబడినది.

కృతుల కొప్పిరి శ్రీశిష్టు కృష్ణమూర్తి

లక్ష్మ్ణణకవులు గౌరవ సూక్ష్మబుద్ధి

కందుకూరి వడ్డాది నిగమ నునర్ల