బడినట్లు కూర్చుట మంచిదని యెంచి యిట్టి నాయభిప్రాయంబునె మన వారెల్లరు గైకొందు రని తలంచి నాటక ధోరణిని వ్రాసితిని...."
గీతనాటకముల కీ నందకరాజ్యము ముంగలిది. పూర్వపుగ్రామ్య వ్యవహారము లిందు సుందరతరముగా నభివర్ణితములు. పదప్రయోగమున నంత ప్రౌఢిమ పొడసూపదు గాని, స్వాభావిగత పెద్దగానున్నది. వైదికులపక్షమున రామదీక్షితులమాటలు:-
భూపుపు సంపత్తికిని వారె మూలబలము
కావుననె నైదికులకు భూకాంతులు మును
పెక్కులుగ జీవనములు కల్పించినారు
బహుదినంబులు పో గుటుంబములు పెరిగి
పఱకో పాతికో చిక్క మావారు సగము
తగ్గి జీవించు చుండిరి దాన దాన
కాని యేలో, యిటీవల హానివచ్చె.
రాజకీయోద్యోగుల పక్షమున శరభోజ పలుకులు:-
"ఇప్పుడీ దీక్షితులు విప్పిచెప్పినట్లు
వైదికుల పైని మాకేమి వైరమేమి?
మేము వారును నొక్కపై మెలగ గన్న
నైకమత్య ఫలంబుల ననుభవింప
గాను మాసరివా రెందు గానకారు.
అయిన నావేడ్క మాకిందు నబ్బదయ్యె;
స్వామి కార్య నిర్వహణము జగడమునకు
మూల మయ్యెను, నిజముగా భూపవర్య!"
శాస్త్రిగారు 1874 లో ముముక్షుతారక మనుపేర భజగోవిందశ్లోకము లనువదించిరి. 1875 లో "బ్రాహ్మణీయము" ప్రబంధము రచించిరి. ఇది యముద్రితము. వీ రనువదించిన "మృచ్ఛ కటికము" మనోహర