పుట:AndhraRachaitaluVol1.djvu/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ మహేంద్రవర కళాశాలలో జదివి 1872 లో బి.ఏ పట్టభద్రులయిరి. ఆయేడు "మాక్డోనాల్డు" బంగారుపతకము వీరికి లభించినది. 1874 మొదలు 1896 వఱకు రాజమహేంద్రవరమున ప్రభుత్వకళాశాలాంగ్ల సహాయోపాధ్యాయపదవి నలకరించిరి. తరువాత బాఠశాలా సహాయపరీక్షకులుగా గూడ నుండిరి.

వాసుదేవశాస్త్రిగారు పేరుగొన్నరచయిత. ఆంగ్లనాటకము లాంధ్రీకరించుటలోను, క్రొత్తయితివృత్తముతో స్వతంత్ర నాటకములు సంఘటించుటలోను శాస్త్రిగారికి బ్రాధమ్య మీయవలెను. జూలియన్ సీజరు. "సీజరు చరిత్ర" మనుపేర వీరాంధ్రీకరించిరి. వీరి "నందకరాజ్య" నాటకమంతయు దేటగీతముతోనే సాగినది. యీపద్యమరయుడు.

తేట గీత మందె దీనిని వ్రాయంగ

మంచి దంచు దోచె మదిని నాకు

సాయ మిండి నాకు సదయత బుధులార!

వావిలాల వాసు దేవ శాస్త్రి.

కథా సరణియందు, పాత్రపేరులయందు మాఱుపు చేయలేదు. ఈ యాదర్శమే వీరేశలింగము పంతులుగారి వెనీసువర్తక చరిత్రాదులను వెలయింప జేసినది. "నందక రాజ్యము" స్వతంత్రాంధ్రనాటకములలో మొదటిదిగా బరిగణింపవలయును. దీని ప్రచురణము 1880 లో దాని పీఠికలో నిట్లున్నది:

"...ఇది నేనువ్రాయుటకు గల్గిన ముఖ్యోద్దేశము మనవారిలో, అందులో బ్రాహ్మణులలో బహుతరముగా గాన్పించునట్టి యైకమత్యమును సర్వవిధంబుల స్వీకరించి దానివల్ల మనమెల్ల మేలువడయ గోరవలయునని యెఱింగించుటె గాని మఱియొకటి కాదని స్పష్టముగా జెప్పు చున్నాడను. ఈ సంగతినే పొడిమాటలతో దెలియ జేయక కధ యొకటి కల్పించి యందులో బరస్పర వైరములు పెంచినవారు శిక్షింప