పుట:AndhraRachaitaluVol1.djvu/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దర్పితములే. తమ్మయరాట్కవీంద్రుని భాగవతకవితలోని కమ్మదనము చూరలిచ్చుట కీపద్యము లుదాహరణముగ నిచ్చుచున్నాడను.

క. కాలము గడచుట నైజం

బేలీలలనైన గడచు హీనులకు, సము

ద్వేల వ్యసనమ్ముల, గుణ

శాలురకున్ హరికథా ప్రసంగవశములన్.

సీ. దేవీపద ధ్యాన దినకర ప్రభలచే

ఘోరసంసారాంధ కారిమణగు

దేవీపదాబ్ద సంసేవానిలంబుచే

దాపత్రయ మహాంబుదమ్ము లణగు

దేవీ వివిధ నామధేయ స్తవాగ్నిచే

గలుష శుష్కారణ్య గణము లణగు

దేవీనమస్కార దివ్యౌషధమ్ముచే

బ్రబలేంద్రియోప తాసమ్ము లణగు

గీ. భక్త జన పరిరక్షణానక్త యగుచు

దేవీ సర్వోత్తమస్థితి దేజరిల్లు

సత్య మిది నిగమాగమ సమ్మతమ్ము

శౌనకమునీంద్ర! నీ కేల సందియమ్ము.

         [వ్యాసకృతతపశ్చర్య-శుకోత్పత్తి]

శా. కన్యన్ నవ్యవయోవిలాస లలితాకారాంగ రంగత్కళా

ధన్యన్ సత్కుల సంభవామలచరిత్ర స్ఫీత సౌజన్య స

మ్యాన్యన్ దుష్కృత పంధ్యతో పథికథా మాత్సర్యరోగక్రుథా

శూన్యన్ బొందిన బొందవచ్చును, దనూజన్ నాకదెట్లబ్బెడున్.