Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ. అవసానంబున దారపుత్రికల డాయంబిల్చి నాకోస మీ

రు వగం బొందకు డీకులాంకురము పేరుం బెంపునుం బొంది ప్రా

పవు మీ కంచును నప్పగించితట మాయక్కయ్యకున్నను నెం

త విశేష జ్నాండవయ్య తమ్మయ విభూ! తండ్రి! కవిగ్రామణీ!

మ. పదుమూడేడుల ప్రాయమంద కవితాప్రావీణ్యముం జూపి న

ల్వది రెండేడులు మాత్రమే బ్రదికియున్ భాస్వద్యశో పల్లి క

ష్టదిశల్ ప్రాకులు సేసి యారవి ని వేశస్థాయివై నిల్చి త

త్పదముం జేరితి వౌర తమ్మయవిభూ!తండ్రి!కవిగ్రామణీ!

తమ్మయకవి దేవీభాగవత రచనకు సరిగా స్వభాను సంవత్సరచైత్ర శుద్ద ప్రతిపత్తు [ 1888-ఏప్రియల్ 8 తేది] నాడు శ్రీకారము చుట్టి, రెండుమూడేండ్లలో సమాప్తి గావించి రని తెలియుచున్నది. ఈరచన మయినపిమ్మట దమ్మయకవి మూడునాలుగేండ్ల కంటే నెక్కువ కాలము బ్రదికియుండ లేదు. ఆయన నిరాణ్యము 1890 లో. జీవితము పూర్వార్ధమున నేవో కొన్ని శతకములు, కొన్నిచిన్నకృతులు రచించి పరిపాక దశలో భాగవతము ప్రారంభించిరి. ఆసంగతి మనకు గవిత్వములోనే పొడంట్టుచున్నది. "గడియలోని నొక్క కావ్యంబు రచియించు భూరితర కవిత్వధార గలడు" అని వీరిని గూర్చి చేసిన ప్రశంస సుప్రశంస. కాకున్న--వేల గ్రంధము రెండేండ్లలో నెట్టులు వ్రాయుదురు! శ్రీదాసు శ్రీరామకవిగారు "దేవీభాగవతము" ను నాలుగునెలలో వ్రాసిరంట. పట్టుదల వచ్చినపు డట్టులు రచించువారని మనము చాలమంది నెఱుగుదుము. తమ్మయకవిగా రాశుగతిని రచించినను వీరి దేవీభాగవతము సుందరతరముగా సాగినది. పూర్వకవులు తిక్కనాదులకు వలెనే వీరికిని కృతిరచనారంభమున గలవచ్చినది. కలలో శ్రీరంగపతి సన్నధి చేసి నాకంకితముగా దేవీభాగవతము దెలిగింపుమనెనట. యథార్థముగ దమ్మయదొర యట్టిరామభక్తుడు. ఆయన కృతులెల్ల భగవ