పుట:AndhraRachaitaluVol1.djvu/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రిగారు వీరి యాస్థానకవులు.ఆయన సంస్కృతాంధ్రములలో నిరూడపాండితి యుండి యుభయ భాషా కవితలయందు నేర్పుగలకవులు. వీరి "జానకీశ్వరశతక" మొకటి ప్రకటితము. ఇట్టిపండితుని తనసంస్థానమున నుంచుకొని తమ్మయ్యకవి పోషించెను. కళాప్రపూర్ణులని విశ్వవిద్యాలయము వారిచే నెన్నబడిన త్రిపురాన వేంకట సూర్యప్రసాదరాయ కవి తమ్మయ్యదొరగారి కుమారరత్న మేసుడి! బాణభట్టుడు, తత్పుత్రుడు భూషణభట్టువలె నీతండ్రి కొడుకులిరువురు పండితులును, గవులు నగుట మెచ్చుకోదగినది. తమ్మయ్యదొర కడు ధన్యుడు. దేవీ భాగవతుడై పోతరాజు "భాగవతకవిత" నారాధించుచు "దేవీభాగవతము" తా నాంధ్రమున రచించినాడు. శ్రీ సూర్యప్రసాదరాయకవి తండ్రిని గూర్చి యిటులువ్రాసెను.

ఉ.భాగవతోత్తముండనగ బ్రస్తుతికెక్క జతుర్హరిద్దరీ

భాగవదాతకీర్తియయి భాసిలె శక్తి కథాసుధాడ్యమౌ

భాగవతంబు దా దెలుగుబాస రచించెదగంగ నమ్మహా

భాగవ రేణ్యు నెన్నగను బన్నగనాథున కైన శక్యమే!

"నిర్వచన కుమారసంభవము"

అదియుగాక తమ్మయ్యదొరగారి కుమారుడు ప్రసాదరాయకవి తండ్రిగారి స్వర్గతికి వగచుచు "మృతజీవి జీవితామృతము" అనుపేరితో రచించినకృతిలో పద్యములు చదువవలసినవి. మూడు పద్యములు మాత్రము ప్రచురించెదను.

మ.నిను మూడేడులప్రాయమంద విడిచెన్ నీతండ్రి, నీవంతకుం

జిననాట న్నను బాసిపోయితి నిదే చిత్రంబు నీయట్ల నే

మనునయ్యో! పితృసౌఖ్యముంబడయగానో చన్, బితంబాయునం

దను కల్ముల్ వృధగానే తమ్మయ్యవిభూ! తండ్రి! కవిగ్రామణీ!