పుట:AndhraRachaitaluVol1.djvu/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరసినచో వీరేశలింగకవి యట్టివాడే. అద్యతనాంధ్రవాజ్మయములో ననేకనూతన మార్గములు వేసి శతాధికకృతులు రచియించి యఖండ కీర్తి నార్జించిన యీకవివరుని యెడ ఏకసంధాగ్రాహిత్వాధలక్షణము లుండుననుట స్వభావోక్తికి దవ్వుగానిమాట.

అచ్చ తెనుగు కృతులు రచించుటలో వీరేశలింగకవిది గొప్పచాతుర్యము. ఈయన శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచననైషధము ప్రసిద్ధమైనది. బిల్వేశ్వరీయములో కొక్కొండ వేంకటరత్న పండితుడు పంతులుగారి నిటులు కొండాడినాడు:

అచ్చ తెనుగు గబ్బ మలవరించుట కూచి

మంచి తిమ్మనయను, మంచి తెలగ

నయును, లింగనయును నయమున స్వీయభా

షాభిమాన మాన్యు లని నుతింతు.

తిమ్మనార్యుడు, తెలగన్నలతోపాటు వీరేశలింగకవి కూడ అచ్చ తెనుగు గబ్బములు కూర్చుటలో దిట్ట.

ఇక గవిచరిత్రరచనము ప్రచురము చేసినవారును పంతులుగారే. శ్రీ గురుజాడ శ్రీరామమూర్తిగారు ఆంగ్లేయుల ననుసరించి తొలుదొల్త దెలుగున కాంధ్రకవిజీవితములు వ్రాసిరి. దానితరువాత వీరేశలింగకవి గారు "ఆంధ్రకవులచరిత్రము" మూడు భాగములుగా వ్రాసిరి. శ్రీరామమూర్తి గారి గ్రంధము కంటె నిది పెద్ద గ్రంధము. దానికంటె దీనిలో జారిత్రక చర్చ మిన్నగా నున్నది. కవికాలనిర్ణయాదులు లెస్సగనిందు గూర్చిరి. కవుల గ్రంధములలో గుణదోష వివరణము గావించిరి. ఈ గ్రంధము వీరేశలింగముగారి శక్తి సామర్థ్యములను జాలభాగము చూరకొనినది. వీరు కొందఱు కవులనుగూర్చి వ్రాసిన కాలనిర్ణ యాదులకు నవీను లంగీకరింపలేదు. ప్రధమ ప్రయత్నమున నిది యాక్షేపణీయము గాదు. పంతులుగారనంతమగు భాషాసేవచేసిన మహాశయులు. సంఘ