పుట:AndhraRachaitaluVol1.djvu/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కరణప్రియులును. స్త్రీ పునర్వివాహకరణోద్యమమునకు బరిపుష్టి గావించిరి. ఈవిషయమున వీరు పెద్దప్రచారము గావించిరి. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారికిని వీరికి బహుకాలము వివాద మీవిషయమున సాగినది. ఇది యాంధ్రమునకు బరిచితము.

వీరేశలింగముగారు పగలు సంస్కరణవిషయములలో, బనిచేసి రాత్రులు గ్రంధరచనము సాగించుచుండు నల వాటుకలవారు. నీరసరోగ పీడితులగుట రాత్రులు వీరికి నిద్రపట్టెడిదికాదు."కాడ్లివరునూనె" యాహారప్రాయముగా నుపయోగించుకొనుచు గ్రంధరచన చేయుచుండువారు. ఈయనకలమునకు మొగమోటమి యనునది కలలోనైనలేదు. సంఘాచారములకు వ్యతిరేకమై పెద్దలకు బ్రతిషాభంగము కలిగించి యీయన వ్రాత యభియోగముల కెక్కినది. కాని యీయన సత్య వాదిత విడువలేదు. చివరికాలమున నవనిందల బాలయ్యెను. చెలికాండ్ర సహవాసము వీడవలసివచ్చెను. ధనవ్యయ మయ్యెను. ఆరోగ్యము చెడెను. ఎట్టిక్లిష్టపరిస్థితులు తటస్థించినను కర్మకూరత్వము సత్యవాదిత్వము విడునలేదు. ఈయన వాజ్మాధుర్యముకంటె వ్రాతనేర్పు గొప్పది. వీరేశలింగంపంతులు వంటి దీక్షాపరుడు, కర, శూరుడు, ధైర్యవంతుడు, కార్యదక్షుడు, స్వార్దత్యాగి, స్వతంత్రుడు ఆంధ్ర మహారచయితలలో లేడు. ఉండడు.