Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునకు లేదు. ఆంధ్రమున రామరాజీయాదులు రెండుమూడు చారిత్రకకృతు లున్నవి. ఇవియు లిట్టివే. ఆంగ్ల సంప్రదాయము ననుసరించి పంతులుగారు తొలుత విక్టోరియా మహారాణి చరిత్రము. జీవసుచరిత్ర తెలుగులో వెలయజేసిరి.అక్కడనుండి యనేక జీవితచరిత్రలు చిత్రింపబడినవి. "స్వీయచరిత్ర" రచనారంభము చేసినవారును వీరే. ఇది 1910 లో వెలువరింపబడినది. పంతులుగారి చిన్నతనమునుండియు గలచరిత మందు సమగ్రముగా రాయ బడినది. సూక్ష్మాంశములు కూడ విస్మరింపక వీరీ చరిత్రము సంధానించిరి. ఇది వీరిమేధాబలమునకు బలకరమగు నిదర్శనము ఈచరిత్రము చదువునప్పుడు సమకాలికులకు నాత్మస్తుతిగాను పరనిందగాను నున్నట్లు కొన్ని పట్టుల గోచరించును. ఈ విషయమే పంతులుగారు తొలుత బేరుకొనిరి. ఈ పంత్తు లరసిన వారిస్వరూప,స్వభావాదులు తెలియును.

"ఎక్కడ నేయక్రమము కనబడినను నాది సహించి యుండెడి స్వభావముకాదు ఆయక్రమమునకు ప్రతిక్రియ జూచువఱకును నామనస్సున కూఱట కలుగదు."

"ఈశ్వరుడు నాకు వేగముగా వ్రాయుశక్తిని ప్రసాదించియున్నాడు. పద్యమునుగాని, వచనమునుగాని నేనొక సారియే వ్రాయుచుందును. వ్రాసినదానిని మరల దిద్ది వ్రాయుట నాకలవాటులేదు. అందు చేత నావ్రాత దిద్ది దిద్ది మరల మరల వ్రాయుచుండువారి దానివలె నంత మెఱుగుగా నుండదనుకొనెదను.

"ఏకసంధాద్విసంధాగ్రాహుల కుండుబుద్ధివిశేషము కొంతకలవాడ నగుటచేత నేనింటనుండి పాఠశాలకు బోవుచు నొకసారియో రెండుసారులో దారిలో బాఠము చూచినంతమాత్రముననే నాకది ముఖస్థమై యప్పటికి దప్పులేక యప్పగింపశక్తుండ నగుదుంటిని."

స్వయముగా దమచరిత్రము తామే వ్రాసికొనుటచే నీపై మాటలు స్వాహంకారపూరితములుగా స్థూలదృష్టికి దట్టును. కాని యధార్థ