పుట:AndhraKavulaCharitamuVol2.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. చెప్పిన నంతరంగమున సింగడుబూరడునై స్రియంబు సాం

పుప్పతిలంగ బల్కెనది యోయి కృతఘ్నుడ నీవు కావె య

ప్ప్పప్ప సుహృత్తముం డయినయాయన నింటికి దెచ్చి వెల్పు నే

చొప్పున గొల్తు రట్లు పరిశుద్ధసపర్యల గొల్చు టొప్పదే- [లబ్ధనాశము]


ఉ. నావిని బ్రాహ్మణుండనియె నన్ను బ్రయత్న మెలర్ప బట్టికిం

గావలిపెట్టి పుట్టినిలు గాల్పగ నీ వటుపోవ నేను నా

లో వివరంబుమాలి మృగలోచన ముంగిస నే కిశోరర

క్షావిధి కొప్ప నేర్పఱచి జాఱితి మందిర బాహ్యభూమికిన్- [అసంప్రేక్ష్యకార్వితము]

                          ________

11. అయ్యలరాజు రామభద్రుడు

ఈకవి యారువేల నియోగిబ్రాహ్మణుడు; తిప్పయార్యుని ప్రపౌత్రుడు; పర్వతన్నపౌత్రుడు; అక్కయార్యుని పుత్రుడు. ఈతడు కడపమండలములోని యొంటిమెట్ట గ్రామములో బుట్టి పెరిగినవాడు; పరవస్తు ముమ్మడి వరదాచార్యునకు శిష్యుడయి వైష్ణవమతాభిమానమును గలిగియుండినవాడు. ఇత డొంటిమెట్టలో నున్నకాలములో నచ్చటి వీరరాఘవస్వామిమీద నొకశతకమును జేసెను. ఇతడు మొట్టమొదట గృష్ణదేవరాయల యంతిమదశలో విజయనగరములో బ్రవేశించి కృష్ణదేవరాయనిచేత దద్విరచితమయిన సకలకథాసారసంగ్రమును తెనిగింప గోరబడెను. కాని గ్రంథపూర్తి కాకముందే కృష్ణదేవరాయలు పరమపదము నొందినందున రామభద్రకవి గ్రంథము నాతని కంకితము చేయక యవతారికయందు కృష్ణదేవరాయల ప్రార్థనచేత దానాగ్రంథమును రచించితినని మాత్రము వ్రాసెను. ఈసకల