పుట:AndhraKavulaCharitamuVol2.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలననే వచ్చెననియు, కొందఱందురుగాని యది యెంతవఱకు సత్యమో తెలియదు. బుక్కభూపాలుని తండ్రియైన సంగ (కంప) రా జొకచిన్న సంస్థానాధిపతియై యుండి, మహమ్మదీయులు దండెత్తి వచ్చి హిందూ రాజ్యమును నాశనముచేసి యోరుగంటి ప్రతాపరుద్రుని చెఱగొనిపోయిన కాలములో తనరాజ్యమును పోగొట్టుకొని యుండును. కొందఱతడు గొల్లవాడని చెప్పుదురు. కాని యాతని పూర్వస్థితిని నిర్ధారణము చేయుటకు దగిన యాధారము లేవియు నిప్పుడు కానరావు. ఈ హరిహర బుక్కరాజులు సహితము ప్రతాపరుద్రుని యవసానదశ యందాతని సేవలో దండనాథులుగా నుండిరని యొకానొకరు వ్రాసియున్నారు. ఏదియెట్లున్నను వీ రారంభదశలో రాజ్యహీనులయియుండి తమ ధైర్యసాహసముల వలనను తమ కులగురువైన మాధవాచార్యుని బుద్ధిబలమువలనను రాజ్యము సంపాదించి, స్వతంత్రులై మాధవాచార్యుని మంత్రిగా జేసికొని యాతని యాలోచన ననుసరించి వర్తించు చుండినట్టుమాత్రము నిశ్చయముగా తెలియవచ్చుచున్నది. మాధవాచార్యులు తానొక దేవత నుపాసించి యాదేవతను బ్రత్యక్షము చేసికొని యామెవరముచేత బుక్కభూపాలునకు రాజ్యమిప్పించెనని కొందఱును, లక్ష్మీకటాక్షమును బొంది సన్నిహితురాలయిన లక్ష్మీదేవిని త న్నైశ్వర్యవంతునిగా జేయుమని కోరినప్పు డామె యాతని కాజన్మమునందు లక్ష్మీ లభింపదని చెప్పగా జన్మాంతరతుల్యమైన సన్యాసమును స్వీకరించి వైభవములను బొందెనని కొందఱును వ్రాసియున్నారు. ఇవి యిటీవలివారి బుద్ధికల్పితములు. ఇటువంటి కథలను కల్పించుటలో హిందువులకు గల సామర్థ్యము మఱియెవ్వరికిని గానబడదు. మాధవాచార్యులకు బూర్వమునందు శంకరాచార్య పీఠమునకు వచ్చిన యతీశ్వరు లాదిశంకరుని వలెను, ఇతర సన్యాసులవలెను పాదచారులయి భిక్షాటనము చేయుచు, శిష్యపరంపరకు తత్త్వబోధను జేయుచువచ్చిరి. ఈ మాధవాచార్యుడు