పుట:AndhraKavulaCharitamuVol2.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుక్కరాజువద్ద మంత్రిగానుండి సమస్తవైభవముల ననుభవింపుచు సన్యసించినవా డగుటచేత దాను సన్యాసియయ్యును తొంటివిభవములను విడువజాలనివా డయి జనులకు దనయందు గల గౌరవాధిక్యము వలనను, రాజానుగ్రహము వలనను, గజాశ్వాందోళనాది సమస్తరాజ చిహ్నములను ధరించి, పీఠాధిపతుల కిట్టి యైశ్వర్యచిహ్నము లుండవచ్చునని నిబంధనముచేసి సమర్థించుకొనెను. ఏనుగులతోను, గుఱ్ఱములతోను, వాద్యములతోను పల్లకులలోనెక్కి సర్వసంగపరిత్యాగు లయిన సన్యాసులు మహారాజ వైభవముతో సంచరించుట దేవతా పరాయత్తమని సాధించుటకై మనవారీ లక్ష్మీకథను తరువాత గల్పించియుందురు. సన్యాసాశ్రమమును స్వీకరించినప్పుడు మాధవాచార్యులవారు విద్యారణ్యు లన్న నామమును స్వీకరించిరి. వీరికాలము నుండియే జగద్గురువుల మనుకొనెడు స్మార్తాచార్యపీఠస్తు లయినయతుల కందఱకును గజాశ్వాదులును వాద్యములును పెండ్లి పల్లకులును పరంపరగా వచ్చుచున్నవి. ఈ మాధవాచార్యులవారు గొప్ప విద్వాంసులు. ఆదిశంకరుల తరువాత శంకరాచార్య పీఠమునకు వచ్చినవారిలో మాధవచార్యులకు బూర్వమునందుగాని పరమునందుగాని యింతటిపండితులు మఱియెవ్వరును లేరు. ఈయన పరాశర మాధవీయ మనుపేర పరాశరస్మృతి కొక్క గొప్ప వ్యాఖ్యానమును, కాలమాధవీయ మనునొక కాలనిర్ణ యగ్రంథమును, శంకరవిజయమును, విద్యారణ్యమని ప్రసిద్ధిగన్న వేదభాష్యమును, నూటయెనిమిది యుపనిషత్తుల కొకవ్యాఖ్యానమును, సర్వదర్శన సంగ్రహమును, మాధవనిదాసమును రచియించెను. రాబోయెడు విజయనగర రాజుల చరిత్రమును దివ్యజ్ఞానముచేత ముందుగానే తెలుపుచు నీ మహావిద్వాంసునిచే రచియింపబడిన దన్న కాలజ్ఞానమను పుస్తక మొకటి కలదు. గాని యది విజయనగర సంస్థానము క్షీణించినతరువాత రచింపబడిన యాధునికగ్రంథ మయియుండును. మాధవాచార్యులవారు తుంగ