పుట:AndhraKavulaCharitamuVol2.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహనాంగి యనునామె "మారీచిపరిణయ" మను నై దాశ్వాసముల శృంగార ప్రబంధము రచియించె ననియు, ఒకరు వ్రాసియున్నారు గాని మా కాగ్రంథము లభింపకపోవుటచేత నిది యిట్లని నిశ్చయింప జాలకున్నాము. కృష్ణరాయని యల్లుడయిన రామరాజు భార్యపేరు మోహనాంగి యైనట్టుసైతము గానబడును. అయినను మోహనాంగి యనుపేరు తిరుమలాంబకు నామాంతరమయి యుండవచ్చును.

మంత్రియైన తిమ్మరుసుయొక్క బుద్ధిబలముచేతను మంత్రశక్తిచేతను కృష్ణదేవరాయని కధికవిఖ్యాతి కలిగెనని చెప్పుదురు. ఇంటిపేరు సాళువవా రయిన ట్లనేక శిలాతామ్రశాసనములవలనను కృష్ణరాజవిజయము వలనను దెలియవచ్చుచున్నందున, ఈమంత్రిశిఖామణి క్షత్రియుడై నట్లు కొందఱు తలంచుచున్నారు. అయినను కృష్ణామండలములోని కొండకాపూరి దేవాలయములోని యొక శిలాదాన శాసనములోమాత్ర మాతనిపేరు సాళువతిమ్మరుసయ్యంగారని వ్రాయబడియున్నది. అయ్యంగారని యుండుటనుబట్టి కొంద ఱాతడు బ్రాహ్మణుడని భ్రమపడినను, "సాళువ" యనెడి యింటి పేరునుబట్టియు నితర నిదర్శనములను బట్టియు నతడు బ్రాహ్మణుడు కాడనియు "అయ్యంగా" రని గౌరవార్థముగా నుపయోగింపబడెననియు నిశ్చయింపవలసియున్నదని స్యూయల్ దొరవారు వ్రాసియున్నారు. మాదయ్యగారి మల్లన్న యీ మంత్రిశిఖామణి యల్లు డగునప్పామాత్యున కంకిత మొనర్చిన రాజశేఖరచరిత్రమువలన నితడు బ్రాహ్మణుడే యనియు నాఱువేలనియోగి యనియు నిస్సందేహముగా దెలియవచ్చుచున్నది. ఈసాళువతిమ్మరాజు కృష్ణరాయని తండ్రి యైన నరసింహరాజు తమ్ముడని కొందఱు చెప్పిరి. ఈసంగతి యథార్థము కాకపోయినను, అతడు నృసింహరాయని యొద్ద మంత్రిగా నుండెను. ఈర్ష్యచేత నృసింహరాయని పట్టమహిషి సవితికొడుకైన కృష్ణదేవరాయని జంపింప యత్నించినపు డాతనిని దనయొద్ద నుంచు