పుట:AndhraKavulaCharitamuVol2.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ. నీలమేఘముడాలు.......................కౌస్తుభముతోడ

గీ. దమ్మి కే లుండ బెఱకేల దండయిచ్చు

లేము లుడిపెడు లేజూపులేమతోడ

దొల్కు దయదెల్పు చిఱునవ్వుతోడ గలద

దంధ్రజలజాక్షు డిట్లని యానతిచ్చె:- [ఆముక్తమాల్యద. 1]


కృష్ణరాయలను గూర్చి బహుకవులు చాటుపద్యము లనేకములు కూర్చియున్నారు గాని గ్రంథవిస్తార భీతిచేత వానినన్నిటి నిందువ్రాయక రెండుమూడు పద్యములనుమాత్రము చూపుచున్నాను:-


1.శా.శ్రీలీలాత్మజ కృష్ణరాయ సమరోర్వి న్నీదువై రిక్షమా

పాలు ర్వీగి హయాధిరూడు లగుచుం బాఱన్ వనీశాఖిశా

ఖాల్నగాయతకేశపాశు లయి యూగన్ గేకిసల్గొట్టి యు

య్యాలో జొంపము లంచు బాడుదురు భిల్లాంభోజప్రత్యేక్షణల్.


2 చ. పెనిమిటిచేయు పుణ్యజనపీడనవృత్తియు దండ్రిభంగమున్

దనయు ననంగబావమును దమ్మునికార్శ్యము జూచి రోసి స

జ్జనపరిరక్షు శౌర్యనిధి జారుశరీరు గళాప్రపూర్ణు న

వ్యననిధికన్య చేరె జితవై రినికాయుని గృష్ణరాయనిన్.


3.చ.కాయమువంగి తా ముదిసెగన్నులునుం బొరగప్పె గాలు పే

దాయె నటంచు రోసి నరసాధిపనందన కృష్ణరాయ యీ

భూయువతీలలామ నిను బొందిన నాదిభుజంగ భర్తకున్

బాయనిచింతచేత దలప్రాణము తోకకు రాకయుండు నే?


ఈకడపటి పద్యముయొక్క కర్తృత్వమును తెనాలిరామకృష్ణున కారోపింతురు. రాజు మాత్రమేకాక కృష్ణరాయని కొమార్తలును సంగీతసాహిత్యములయందు నిపుణురాండ్రనియు, రామరాజుభార్యయైన