పుట:AndhraKavulaCharitamuVol2.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   ద్దీపితతీవ్రకోపమున దేవత లెల్ల నుతింప నాటివిల్
   పాపపుడిల్లిమీద దెగ బాపగదే శరభాంకనిదగమా.

తిమ్మకవి సులక్షణసారమున దన్ను గూర్చియు డనప్రజ్ఞదికమును గూర్చియు నిట్లు చెప్పుచున్నాడు-


క. లక్షణశాస్త్రము లెల్ల బ|రీక్షించుట గొంతకొంత యెఱిగినవాడన్
   లాక్షణికానుగ్రహత సు|లక్షణసారం బొనర్తు లక్ష్యము లమరన్.


గీ. గొంద ఱెంచులక్షణమును గొంద ఱెంచ
   రందఱును నెంచినవికొన్ని యవియు నవి ము
   దొరయగా గూర్చి కవిసమ్మతులను వ్రాయు
   దొకటి కొకటికి సంస్కృతాంధ్రోక్తు లెనయ.


గీ. గ్రంథసామగ్రి గలుగుట బ్రతిపదమున
   కన్నిలక్షణములువ్రాయు దనిన నందు
   గ్రంథవిస్తార మగుగాన గవితసూత్ర
   మెన్నిటను దేలిపడు నన్ని విన్నవింతు.

ఈకవియన్నయయిన రామకవిచేసిన మత్స్యవామపురాణములు నాకు లభింపలేదు. ఈకవిచే నుదాహరింపబడిన తూద్రకరాజచరిత్రము, అనిరుద్ధచరిత్రము, ఆదినారాయణచరిత్రము మొదలయిన తెలుగుకావ్యములుసహిత మిప్పుడు కొన్నిగానరావు. ఇప్పుడు ముద్రితమైయున్న సులక్షణసారమునకును నాయొద్దనున్న యముద్రితపుస్తకమునకును మిక్కిలి వ్యత్యాసము కనబడుచున్నది. కవిసర్పగారుడము, శ్రీధరఛందస్సు, కవిగజాంకుశము, వాదాంగదచూడామణి, ఆంధ్రశబ్దచింతామణి, సర్వలక్షణశిరోమణి, సర్వలక్షణసారసంగ్రహము, గోకర్ణఛందస్సు. ఉత్తమగండఛందస్సు, భీమనఛందస్సు, అధర్వణఛందస్సు, అనంతఛందస్సు, కావ్యచింతామణి, కావ్యాలంకారచూడామణి, ఛందోదర్పణము, ఆంధ్రభాషాభూషణము అను తెనుగులక్షణగ్రంథముల నుండి యీసుల