పుట:AndhraKavulaCharitamuVol2.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 
   నకు రామకవివరునకు ననుజన్ముడ నారామకవి చెప్పినట్టిమహిత
   మత్స్యపురాణ వామనపురాణాది సత్కవితలకెల్ల లేఖకుడ వృద్ధ
   కుండికాతీరలింగమకుంటనామ
   పట్టణస్థితికుడ సౌభాగ్యయుతుడ
   నాదిశాఖాప్రవర్తన నమరువాడ
   గాశ్యపసగోత్రుడను దిమ్మకవిని నేను.

ఇందు జెప్పబడిన భట్టరు చిక్కాచార్యులే తనకు గురువై నట్లు తెనాలి రామకృష్ణకవియు పాండురంగమహాత్మ్యమున నీక్రిందిపద్యమున జెప్పుకొనియున్నాడు.


క. వాక్కాంతాశ్రయభట్టరు | చిక్కాచార్యులమహాత్ముశ్రీగురుమూర్తిన్
   నిక్కపుభక్తి భజించెద | నిక్కావ్యకళాకలాప మీడేఱుటకున్.

రామకృష్ణునితోడి సమకాలీను డగుటచేత లింగమగుంట తిమ్మకవి 1620 వ సంవత్సర ప్రాంతములం దున్నవాడు. ఇతడు వృద్ధదశలో కాకునూరి యప్పకవికాలములో సహిత ముండియుండవచ్చును. ఇతడు బహులక్ష్యలక్షణగ్రంథములను శోధించినవాడు. అప్పకవి యుదాహరించిన పెక్కు పద్యము లీసులక్షణసారమునందును గానబడుచున్నవి. "గడియలోపల మూడుకండ్రికలై త్రాడు ధర గూలదిట్టె మేధావిభట్టు" ఇత్యాదిసీసపద్యములను దానిక్రింద నప్పకవీయములో నుదాహరింపబడిన "సాళువ పెదతిమ్మమహీపాలు" డిత్యాది సమస్త పద్యములును సులక్షణసారమునందు గానవచ్చుటయేకాక శరభాంకుడు పద్యము మొదల చకారమును, 6 వ చోట హకారమును, 11 వ చోట కకారమునుంచి డిల్లీపట్టణమును దిట్టిన చాటుధారయని యీక్రిందిపద్య మొకటి యదికముగా నుదాహరింపబడి యున్నది-


ఉ. చాపముగా నహార్యమును జక్రిని బాణముగాగ నారిగా
   బావదొరం బొనర్చి తలపం ద్రిపురంబుల గాల్పవే మహో