పుట:AndhraKavulaCharitamuVol2.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్షణసారమునం దనేకలక్షణములు చేకొనబడినవి. కవిత్వరీతిని జూపుటకయి లక్షణగ్రంథములనుండి పద్యములను జేకొనుట న్యాయము కాకపోయినను సులక్షణసారమునుండి రెండుపద్యముల నిం ధుహరించుచున్నాను.


మ. వినుమీరీతియటంచు గావ్యకరుడై వెల్లంకి తాతప్ప చె
    ప్పినసూత్రంబులు కల్లగా గనబడెన్ వీక్షింప నెట్లన్నచో
    మునుదీర్ఘంబులపై ఱకారములకే పూర్ణస్థితప్రజ్ఞ గా
    దనియెన్ లింగమగుంట తిమ్మకవి నే దర్కింతు నిప్పట్టునన్.


చ. అనుచు నదేమొకో మును రయంబున లక్షణసారసంగ్రహం
    బెనయ వచించె జిత్రకవిపెద్దన లెస్సవువోడు వోడృ శ
    బ్దనయతగానరో వినరో దద్ఘను లెంతయు ధన్యు లయ్యు మే
    ల్గన భ్రమ గాంతు రాత్మల నొకానొక చోట బరాకు గ్రమ్మగన్.



49. వెలగపూడి వెంగనార్యుడు


ఇతడు శ్రీలీలాశుకయోగి విరచితమైన కృష్ణకర్ణామృతమును మూడాశ్వాసముల గ్రంథముగా దెనిగించెను. ఈకవి యాఱువేల నియోగిబ్రాహ్మణుడు; పెద్దనామాత్యునిపుత్రుడు. ఇతడేకాలమునం దుండినవాడో నిశ్చయముగా దెలియదుగాని యీతని కృష్ణకర్ణామృతములోని పద్యమొకటి సులక్షణసారమునం దుదాహరింపబడి యుండుటచేట నితడు 1930వ సంవత్సరమునకు బూర్వమునం దుండెనని మాత్రము తెలియును. ఈతనికవిత్వము నిర్దుష్టమయి శ్రావ్యముగా నున్నది. కృష్ణకర్ణామృతములోని పద్యములు మూటి నిందు జూపు చున్నాను -