పుట:AndhraKavulaCharitamuVol2.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడు. సునందాపరిణయమునందు గుంటుపల్లి భాస్కరు డిట్లు వర్ణింపబడి యున్నాడు.


సీ. స్థిరతరప్రజ్ఞావిశేషాతినిష్ఠాతిరస్కృతనిర్జరరాడ్గురుండు
   అసదృశమంత్రయోగాతివశీకృత సన్మంత్రదేవతాసముదయుండు
   నిరుపమశ్రుతిశూక్తనిర్ణీతసన్మార్గవర్ణోచితాచారవర్తనుండు
   ఘనతరపాణినీగ్రంథార్థశోధనసందర్భసన్మనీషాన్వితుండు


   సత్యభాషాహరిశ్చంద్రజనవిభుండు
   సలలితౌ దార్యనిర్జి తజలధరుండు
   ఎల్లమాంబాసతీప్రాణవల్ల భుండు
   గుంటుపల్లి భాస్కరుడు సత్కులవరుండు.

దీనినిబట్టి కంసాలిరుద్రయకవి కృష్ణదేవరాయనికాలములో లేక, 1620 వ సంవత్సరప్రాంతములయం దుండినట్లు తేలుచున్నది. నిరంకుశోపాఖ్యానములోని,



శా. శ్రీభాషారమణావిమృష్టపదరాజీవోత్తమాంగాగ్రు డా
   ర్యాభామాపరిణీత సర్వజగదారాధ్యుండు మూర్తిత్రయీ
   శోభాకందము కందుకూరినగరీసోమేశ్వరస్వామి లో
   కాభీష్టంబు లొసంగుగాత గరుణాయతైకచిత్తంబునన్.

ఈమొదటిపద్యమునుబట్టి కవి తనగ్రంథమును కందుకూరి సోమేశ్వరస్వామి కంకితముచేసినట్లు తెలిసికోవచ్చును. ఈకావ్యమును శివుని కంకితము చేసెదనని కవి యీక్రిందిపద్యములో మనోహరముగా జెప్పియున్నాడు-



ఉ. కోమలవర్ణదామయును గోవిదసం స్తవనీయలక్షణ
   స్తోమపదాభిరామయును శుంభదలంకరణప్రసాధన
   స్థేమయు నప్రతర్క్యగుణసీమయు నైనమదీయకావ్యక
   న్యామణి నిచ్చి మంచుమలయల్లుని నల్లునిగా నొనర్చెదన్.