పుట:AndhraKavulaCharitamuVol2.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

  బళిబళి మంచిమాటయె ప్రబంధమునా జలరాశి యందులో
  పల నెరసు ల్గ్రహింతురె యపారములౌ మణు లెల్ల నుండగన్.[అప్పకవీయము.పంచమాశ్వాసము]

దీనినిబట్టి చూడగా సరసమనోరంజనములోని దన్న పయిపద్యము భద్రయ చెప్పినదిగాక రుద్రయ చెప్పినదనియు, అతడు కృష్ణదేవరాయలకాలములో గాక గుంటుపల్లె భాస్కరునికాలములో నుండెననియు స్పష్టబడుచున్నది. కాబట్టి కృష్ణదేవరాయని కాలములో భద్రయ్య యనుకవి యున్నాడో లేడో యనికూడ సంశయింపవలసి యున్నది. పయినిజెప్పిన లిఖితపుస్తకభాండాగారములోని చాటుపద్యములలోనే సరసమనోరంజనములోని దయినట్లుగా నీక్రిందిపద్యముకూడ వ్రాయబడియున్నది-


సీ. కొప్పున జుట్టినగొజ్జంగివిరిదండ నటనతో వీపున నాట్యమాడ,
   బటువైనముత్యాలపాపట విరజాజితీరుగా జెంపల దిమురుగట్ట,
   ధగధగద్ధగలచే దనరుకెంపునతాళి సరులతో బెనగొని చౌకళింప,
   గబ్బిగుబ్బలమీది కస్తూరిచెమటల గరగివాసనలచే గ్రమ్ముకొనగ.


   వింతమాటల తేటల విభుని గూడి
   కాంత రతికేళి మిక్కిలి గారవింప
   దప్పి తీఱంగ నధరామృతము లొసంగి
   చంద్రబింబాస్య మగులాగు సలిపె నపుడు.

ఇతడు నిరంకుశోపాఖ్యాన మను నాలుగాశ్వాసముల ప్రబంధమును సుగ్రీవవిజయమను యక్షగానమును రచియించెను. ఈగ్రంథమును బట్టి చూడగా గృష్ణదేవరాయనికాలములో భద్రయ్య యనుకవి లేడనియు భద్రయ్య యనబడినకవి యప్పకవి చెప్పినట్లుగా గుంటుపల్లి భాస్కరునికాలములోనుండిన రుద్రయ్యయేయనియు స్పష్టపడుచున్నది. ఈగుంటుపల్లి భాస్కరుడు పదునేడవశతాబ్దారంభమునం దుండిన