పుట:AndhraKavulaCharitamuVol2.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 స్తోత్ర మొనర్ప నర్హ మగుసూక్తిగతిన్ రచియించితౌ గదా

ధాత్రి బ్రసిద్ధిగాంచితివి ధన్యుడ వౌర కుమారధూర్జటీ.


చ. డెలు గున జెప్ప నేర్చినసుధీజను లెల్ల సెబాసు ధూర్జటీ
 
బళి యన దళ్కువగ బాటిలు తేట తెనుంగుమాటలన్

మెలకువగాంచు బెళ్కుజిగిమించ బ్రబంధములన్ ఘటించితౌ

పలుకులముద్దరాలిమిహిబంగరుటందెరవల్ చెలంగగన్.



క. మాకరుణకు బాత్రుండవు|ప్రాకటగతి బద్యకావ్యఫణితిం జెపుమా

శ్రీకృష్ణరాయచరితము|నీకవితాప్రౌడి సుకవినికరము మెచ్చన్.


శ్రీకృష్ణరాజవిజయములోని యీక్రిందిపద్యమునుబట్టి చూడగా గృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవమునాటి కార్వీటి బుక్కరాజు జీవించియున్నట్టే కనబడుచున్నది-



సీ. చక్కెరవిలుకాని చక్కదనముగల్గి చొక్కమౌ నార్వీటి బుక్కరాజు,

సాకల్యముగ గీర్తి సర్వదిక్తటులందు బ్రాకటస్థితిమించు నౌకువారు,

కంటకరాజన్య గర్వంబు లడగించి లీలచే మించునంద్యాలవారు,

ధాటీనిరాఘాట ఘోటీహతవిరోధికోటులై వెలయు వెల్గోటివారు.

చండతరశౌర్యు లగు పెమ్మసానివారు

బూదహళివారు మొదలైనభూమిపతులు

గొలువ పట్టాభిషిక్తుడై చెలువుమీఱె

రమ్యగుణపాళి శ్రీకృష్ణరాయమౌళి.


ఈకవియొక్క తాత కృష్ణదేవరాయని యాస్థానమునం దున్న వాడగుటచేతను కృష్ణరాజవిజయమును జెప్పునప్పటి కితడు బాలుడని చెప్పబడియుండుటచేతను కృష్ణరాజవిజయము 1550 వ సంవత్సర