పుట:AndhraKavulaCharitamuVol2.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యమునందలి యీక్రింది కవిస్తుతి పద్యమువలననే యీకవియొక్క ప్రౌఢిమ తేటపడుచున్నది-


సీ. వాక్ఛాసనుం డగువాని నిక్కంబుగా నలబ్రహ్మదేవుడేయని నుతింతు

గుండలీంద్రసమాఖ్య గొమరొందుకవిచంద్రు ననువొంద శేషాహియని తలంతు

శ్రీనాథవిఖ్యాతిజెన్నొందుబుధవర్యు బురుషోత్తముడటంచుబుజ్జగింతు

ధూర్జటిప్రౌడిచే నూర్జితుం డగువాని సాక్షాచ్ఛివుండని సంస్మరింతు

నవని మఱియును వెలసిన యాంధ్రకవుల

సాధునిక పూర్వకవుల యశోధనికుల

సారసాహిత్యసౌహిత్యసరణి వెలయ

వర్ణన వొనర్తు రమణీయవాక్యములను


ఈకవి తన్నుగూర్చి కృష్ణరాజవిజయమునం దీక్రిందిరీతిగా జెప్పుకొన్నాడు-


సీ. నను భరద్వాజగోత్రుని సదాపస్తంబసూత్రుని బాంధవస్తోత్రపాత్రు

బాక నా టార్వేలవంశప్రసిద్ధుని ధూర్జటిపౌత్రు బంధురచరిత్రు

సద్గురుకారుణ్యసంప్రాప్తవిద్యావిహారుని శ్రీకాళహస్తినిలయ

చిత్ప్రసూనాంబికాశ్రీక రానుగ్రహాసాదితకవితారసజ్ఞ హృదయు

సారరచనాధురీణు గుమారధూర్జ

టిప్రధానాగ్రగణ్యు బటీరహీర

మహితసత్కీర్తి గాళియామాత్యపుత్రు

వేంకటార్యుని బిలిపించి వేడ్క ననియె.


క. బాలుడ వయ్యును విద్యా | శీలుడవు గభీరమథురశృంగారకళా

లాలితచాతుర్య కవి | త్వాలోచననిపుణ వేంకటామాత్యమణీ.

ఉ. చిత్రముగాగ బిన్నపుడె చెప్పితివౌ రసము ల్చెలంగ సా

విత్రిచరిత్రమున్ మిగుల వేడుక నిందుమతీవివాహమున్