పుట:AndhraKavulaCharitamuVol2.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. గారెలు బూరె లిడ్డెనలు గమ్మనిదోసెలు జక్కిలంబులున్

జారులు గూరలున్ ఫలరసంబులు దేనెలు బానకంబులున్

సారెలు బాయసాన్నములు జక్కెర లప్పడంబులున్

బేరిననేతులుం జెఱకుబిళ్ళలు జల్లనినీరుమజ్జిగల్. [ఆ.1]


ఉ. పాపము చేయవల్దనుచు బల్మఱు బెద్దలు చెప్పిన న్మహా

కోపముమీఱ వారియెడ గుత్తుకబంటివిషంబు గ్రక్కుచున్

బాపము గీప మేడది నెపం బిడి జీవము దాటిపోయి యే

దాపున నెందు బోవునొ నిదాన మెఱుంగ రివేటిబోధనల్. [ఆ.2]


మ. జమువెంటం బురవీధులం జనుచు భాస్వత్పట్టణశ్రీవినో

దము లీక్షింపుచు జూడ జూడ మఱియుం దండోపతండంబులై

భ్రమ కల్పించుపురీవిశేషములకుం బ్రాజ్యాద్భుతానీతుడై

యమునిం గన్గొని పల్కె సంయమి మరందానందసాంద్రోకులన్. [ఆ.3]

                           _________

17. కుమార ధూర్జటి

ఈకవికి నిజ మయినపేరు వేంకటార్యుడు. ఇతడు పాకనాటి నియోగిబ్రాహ్మణుడు, కాళియామాత్యుని పుత్రుడు; ధూర్జటి పౌత్రుడు. ఈకవి యాకువీటిరా జయిన చినవేంకటాద్రియొక్క కోరిక మీద గృష్ణరాయవిజయ మనుపేర కృష్ణదేవరాయల చరిత్రమును శ్రీరామాంకితముగా రచియించెను. ఈతని కవిత్వము మిక్కిలి రసవంతమైనది. ఇతడు కృష్ణరాజవిజయ మనెడి యీనాలుగాశ్వాసముల గ్రంథమును మాత్రమే కాక సావిత్రీచరిత్రము, ఇందుమతీవివాహము మొదలయిన గ్రంథములుకూడ జేసినట్లు తెలియవచ్చుచున్నది. కృష్ణరాజవిజ