పుట:AndhraGuhalayalu.djvu/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తారక వనమందలి ఋషుల గర్వాన్ని శివుడు అణచిన రీతినుండియే శివనృత్యము ఉద్భవించినదని పురాణములు తెలుపుచున్నవి. ఈ ఋషులు తపస్సులు చేసి తమ ఘనతకు గర్వపడుచుండిరి. కానీ వారి సతులు దానిని నిరసించుచుండిరి కడకు వారు దేవతాశక్తులనే నిరసించుచుండుటనే శివవిష్ణువులు వీరి చర్యలను అణచవలచిరి. విష్ణువు అందగత్తెయైన మోహిని అవతారమును ధరించగా శివుడు అందమైన నిరంబర యువకుడుగా భిక్షాటనమూర్తి రూపమున సతిని తరుముచున్నట్లు నటించుచుండగా విష్ణువు దూరముగా పారిపోయెను. అందమైన స్త్రీరూప విష్ణువును చూసిన ఋషులు తమ తపోకృషినంతటిని మరచి మోహినిపై దృష్టి కేంద్రీకరించిరి. వారి భార్యలుకూడా ఆ కన్యను పట్టుకొనిరి. శివుడు కడకు ఆ కన్యను తీసుకొని వెళ్ళెను. కాని వీరు తమ హృదయములను కోల్పోయిరి. కన్య విషయమున కల్పించుకొనుటకు కోపోద్రిక్తులై ఋషులందరు ఒక క్రతువును చేసి ఒక సర్పమును, పులిని, నాశము చేసెడి అగ్నిని, ఒక మమూలకుడనెడి రాక్షసుని సృష్టించిరి. వీరినందరినీ శివుడు నాశనముచేసి, సర్పాన్ని తన ఆభరణముగా, పులిచర్మాన్ని తన వస్త్రముగా, అగ్నిని తన ఆయుధముగా చేసుకొని మమూలకుని దేహముపై నృత్యము చేసెను. ఇది ఒక పురాణగాథ. ఈ శివరూపమునే "నటరాజు" - నృత్యకారులకు రాజు అందురు.

"In the brief the essential significance of Siva's dance is threefold.

Firstly, it is the image of His rhythmic activity as the cource of all movement within the cosmos which is represented by the encircling arch or Prabhavali.

Secondly, the purpose of His dance is to release the countless souls of men from the snare of illusion - Maya.

Thirdly, the place of His dance - Chidambaram, the centre of the universe is within everyone's heart.

In brief the dance that Siva makes is believed to symbolise the action of cosmic energy in creating, preserving and destroying the visible universe."

శివుని నటరాజ రూప దేవాలయాలలో చిదంబరమందలి దేవాలయము ముఖ్యమైనది ఇచటనే కనకసభయనెడి కేంద్ర దేవగృహమందు నటరాజు శివకామసుందరి రూపమున వున్న తన సతియైన పార్వతితోపాటువున్నాడు. శివుడు నటరాజు రూపమున అన్నిరకాలలోను స్థానక రూపమున చూపబడియుండును నటరాజు రకాలలో ఆనందతాండవ (మమూలక రాక్షసుని దేహమునై నృత్యము చేయుట), సంధ్య తాండవ (రాక్షసుడు లేకుండా ఉన్న నృత్యము). ఉమాతాండవ (ఎడమవైపున ఉమ నిలుచొనియున్న నృత్యము), గౌరీతాండవ(కుడివైపు నందికేశ్వరుడు. ఎడమ ఉమ యుండగా నృత్యరూపము), కలికతాండవ (2 కండ్లు, 8 చేతులు కలిగి త్రిశూలము. noose, kettledrum, కపాలము, నిప్పు(fire bell), అభయ,వరద పోజులుండుట, త్రిపురతాండవ (16 చేతులు, ఆయుధములు కలిగి గౌరి, స్కంధ చెరొకవైపుండుట), సంహారతాండవ (8 చేతులు కలిగి పుర్రెల హరము గలిగి ఉగ్రరూపము గలిగియుండుట). లలితతాండవ (4 లేక 8 చేతులు గలిగి పీఠముపై కాళ్ళుగలిగి కొంత లోనికి వంగియుండును). ఊర్ధ్వతాండవ (కుడికాలు తలవరకు పైకెత్తి, ఎడమకాలు అపస్మారునిపై వుంచి 16 చేతులు కలిగి ఆయుధాలనేకము గలిగి మధుర, రామనాధపురం, తిరణల్వేలిలోని స్తంభాలు పాండ్యకాల శిల్పాలవలె యుండును) ములు గలవు.