పుట:AndhraGuhalayalu.djvu/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇటుక కొయ్యల నుపయోగించి నిర్మించిన వాస్తు శిల్పములు ఏక శిలలో వికసించుట మనకు ఈ దశలో అగుపడును. ఉదయగిరి (గ్వాలియర్), అజంతా, తొలి ఎల్లోరా, బాదామి , మహాబలిపురం, గుంటుపల్లి, శంకరం గుహాలయాలు ఈ తెగకు చెందినవే. ఏకశిలా నిర్మాణాలపై గల మోజును ఏక శిలతో నిర్మింప బడినవైన ఎల్లోరా కైలాస దేవాలయం, మహాబలిపుర పంచ పాడవ రధాలు, కలుగుమలై ఆలయములు తెలుపుచున్నవి. కైలాస దేవాలయము ఒక అద్భుతమైనది. " the first of which (kailasa temple) is by any standard an exceptional effort on a challenging medium (stone)" కానీ ఇదే కాలమున ఏక శిలా నిర్మాణములతో బాటు కొన్ని ప్రాంతలలో శిల నుపయోగించి దేవాలయలను కట్టెడి విధానము ప్ర్రారంభించుట కూడా జరిగినది. ఐహోలె (కర్ణాటక), నాచ్ న (మధ్య ప్రదేశ్) దేవోఘర్ (గ్వాలియర్) మొదలగు ప్రాంతాలలో క్రీ.శ. 6 వ శతాబ్దమునను, కాంచీపురము, బాదామి, పట్టడకల్, ఐహోలె, అలంపూర్ లలో క్రీ.శ. 7 వ శతాబ్దము ఆఖరు లోను, క్రీ.శ. 8 వ శతాబ్దము తొలి దశలోను జరిగిన దేవాలయ కట్టడాలు ఈ కట్టడ దేవాలయాల వాస్తు రీతి పునః ప్ర్రారంభ దశను తెలుపు చున్నది. వీటిలో అలంపూర్ దేవాలయాలు, ఐహోలె దేవాలయాలు, గుప్తానంతర మధ్యదేశ దేవాలయాలు, గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులో గల 'రోడ ' యందలి దేవాలయాలు, మార్వార్ లోని ఓసియన్ లోని 'ప్రతిహారుల ' దేవాలయాలు, 'ముఖలింగ ' మందలి గాంగ రాజుల దేవాలయాల వలె పరిణామ దశను గాక పరిణతి దశ నిర్మాణ రీతిని తెలుపు చున్నవి. ఈ పరిణతి దశ కొలది కాలమునకు దేదీప్యమానము (magnificience) మరియు అతివ్వయము (extravagence) నకు (దేవాలయ కట్టడాలలో)దారి తీసినది. దీని ఉదాహరణగా ఆంధ్రలోని సింహాచలం, పాలంపేట మొదలగు దేవాలయాలను చెప్పవచ్చును.

కానీ మలిదశ దేవాలయ కట్టడాలలో అనుకరణకు, నాణ్యత (quality) కన్నా క్వాంటిటీకి ప్రాధాన్యత అగుపడును. శిల్పమందు కూడ ముతుక దనము(coarseness) మరియు కాఠిన్యము (rigidity) అగుపడును.

ఆంధ్ర ప్రదేశ్ లోని దేవాలయాలు తొలినుండి కూడ దేశమున నిర్మింప బడియున్న అనేక వాస్తు శిల్ప నిర్మాణ రీతుల ప్రభావమునకు లోనగుచు ఒక నూతన మిశ్రమ తరహా వాస్తు శిల్ప రీతికి అవకాశ మిచ్చినవి. క్రింది వాక్యములలో ఇది మనకగుపడును.. The temples of Andhra pradesh, from their adolescence to decay, were constantly subjected to influence of architectural and art impulses from the center of early art endeavor and were thus, to certain extent, amalgams in structural mode. The elegance of the nagara sikhara profile and its typical wall decorative motifs as from Central India, the stamina of the Deccani, clarity of ground plan and sumptuous yet suave figure sculpture as from Aiholi, the almost effeminate grade of the Orissan art and architectural trends, the prodigious industry and craft superiority of the later Chalukyan temples of the Deccan and Karnataka the majestic stature and solid strength of the southern Dravidian temple forms and profiles, all seeped into the Andhra mound and enlarged its mass appeal and enriched the artistic vision. the innate acumen of the Andhra craftsmen who had had an unbroken tradition of art endeavour right from the time of the imperial Satavahanas, and whose Canvas had an enviable with of geographical horizan enveloping the western and the eastern seas., and the Ganga and the Pennar plains responded to their adventitious central location for receiving and harmonising these traditions of their near and distant neighbors. In sum, the sweeping panorama of the"