పుట:AndhraGuhalayalu.djvu/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"architectural creations of Andhra pradesh from the early historic up to early medieval times was composite to a large extent, and electric to the core. The fertile plains of the Godvari and the Krishna had this spirit of assimilation operating in spheres religious as well as temporal (K.v.Soundara Rajan)

ఆంధ్ర గుహాలయాల పరిణామ దశలు, నిర్మాతలు :

ఆంధ్రుల వాస్తు పరిణామ చరిత్రలో గుహాలయాల పరిణామ దశలు ఒక ప్రముఖ స్థానమును కలిగి యున్నది. అర్థిక పురోభి వృద్ధి, సాంస్కృతిక ఔన్నత్యములు అతి ప్రాచీన కాలము నుండి ఆంధ్రలో ఏర్పడిన కారణముగా ఇతర ప్రాంతాల ప్రభావములకు కూడ ఇది లోనగుచుండినది. శాత వాహనుల తరువాత ఇక్ష్వాకులు, వారి తరువాత కంచి కేంద్రముగా గల పల్లవులు ధాన్యకడ (అమరావతి) లో ప్రతినిధిని గలిగి కృష్ణా నదీ పరిసర ప్రాంతాలను పరి పాలించిరి. పల్లవులు తూర్పు ఆంధ్రలోని కృష్ణా తీరముననే గాక పశ్చిమాంధ్రలోని 'శాతవాహాని రట్ట ' యనెడి నేటి బళ్ళారి ప్రాంతమును కూడ పాలించిరి. బహుశా ఈ బళ్ళారి పల్లవుల స్వాధీన మందుండిన కాలముననే పల్లవులు దక్కన్ లో వీరికి పూర్వపు రాజ వంశాల వారు రూపొందించిన గుహాలయాల గూర్చి తెలుసుకొనుట జరిగి యుండవచ్చును. ఈ వాస్తు రీతినే (గుహాలయాల నిర్మాణము) సింహ విష్ణు వంశజుడైన నవీన పల్లవ రాజు మొదటి మహేంద్ర వర్మ తమిళ ప్రాంతమున కఠిన గ్రనైట్ శిలలో ప్రారంభము చేసేను. ఈ ఘనతకు తగ్గ రీతిలో ఇతడు తన 'మదగన్నట్టు ' శాసనములో చెప్పబడి నట్లు 'విచిత్ర చిత్త ' మొదలగు బిరుదులు ధరించినాడు.

ఆంధ్ర రాష్ట్రములోని కృష్ణా, గుంటూరు జిల్లాలలోని విజయవాడ, మొగల్ రాజ పురము, ఉండ వల్లి ప్రాంతాల లోని గుహాలయాలు, నెల్లూరు జిల్లాలోని భైరవ కోన గుహాలయాలు, పల్లవ నిర్మాణాలుగా గొందరు, మరి కొందరు విష్ణు కుండిన రాజులు లేక క్రీ.శ. 6 వ శతాబ్దమున దిగువ కృష్ణా నదీ ప్రాంతాలలో పరిపాలించిన (చాళుఖ్య రాజైన రెండవ పులకేసి తీరాంధ్ర ముట్టడికి పూర్వము) తెలుగు చోడ రాజులు లేక తూర్పు చాళుక్యులు నిర్మించి యుందురని భావించుట కలదు. నిజమేదియో తెలుసుకొన వలసి యున్నది. కాని ఈ రాజ వంశాలు ఇకరి నుండి మరొకరు వాస్తు రీతులను స్వీకరించుట మనకగుపడును.

విష్ణుకుండినులు దక్కన్ లోని వాకాటక రాజ వంశాల సమకాలికులుగా యుండుటే గాక వారితో శత్రుత్వము కలిగి యుండుట వలన అయుద్ధాల కాలాలలో వారి వాస్తు శిల్ప రీతుల గూర్చి తెలుసుకొనెడి అవకాశము ఏర్పడి అట్టి నిర్మాణాలను వీరు పై ప్రాంతాలలో నిర్మించి యుండవచ్చును. విష్ణు కుండినులు హైందవ మతాభిమానులు. అంతే గాక ఈ వంశజులలో మొదటి మాధవ వర్మ, మూడవ మాధవర్మలు అశ్వమేధ, అగ్నిష్టమ, హిరణ్య గర్భ యజ్ఞములను, మహాదానములను చేయుటే గాక తమ వంశ (కుటుంబ) మంతయు శ్రీ పర్వత స్వామికి అంకిత మైన భక్తులుగా (నల్లమల కొండలలోని శ్రీ శైల మల్లికార్జున స్వామి) చెప్పుకొనుట కూడ ఈ గుహాలన్నియు వీరే నిర్మించి యుండవచ్చునని అభిప్రాయము గలదు. ఇదే నిజమైతే ఇవి రెండవ పులకేసిచే కునల (కొల్లేరు సరస్సు) ప్రాంత యుద్ధమున ఓడి పోయిన వేంగీ రాజ్యాధిపతి మూడవ మాధవ వర్మ (C. 556- 616 A.D.) లేక అతని కుమారుడు వీటి నిర్మాతలై యుండ వచ్చును. కాని యుద్ధమొక ప్రక్క చేయుచు ఇది సాధించ గలిగి యుండెడి వారా యని సందేహ మేర్పడును.

పల్లవులే ఆంధ్ర లోని గుహాలయ నిర్మాతలనుటలో కూడ ఇదే సందేహ మేర్పడును. మొగల్ రాజ పురము గుహాలయాలు పల్లవ మహేంద్ర వర్మ నిర్మాణాలుగా (ఐదవ గుహలోని పూర్ణ ఘట రూపము, నాల్గవ గుహలోని