Jump to content

పుట:AndhraGuhalayalu.djvu/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలమునకు ఇటుక స్థానములో శిల వాడుట సాంచి, అమరావతి వంటి ప్రాంతాలలో ప్రారంభమగుటతో వాస్తు నిర్మాణరీతులలో కొన్ని మార్పులు జరిగినవి.

మూడవ దశలో బౌద్ధ హిందూ గుహాలయాల నిర్మాణాలు జరిగినవి. ఈ కాలముననే భవిష్యత్తులో జరిగిన దేవాలయాల నిర్మాణాలకు కావలసిన వాస్తు, శిల్ప రీతులు రూపు దిద్దుకొనుట జరిగినది.

ఆంధ్రుల హిందూ గుహాలయాలకు సంబంధించి విజయవాడ, మొగల్ రాజ పురము, ఉండవల్లి, భైరవకోనల లోనివి ముఖ్య మైనవిగా చెప్పవచ్చును. కాని ఈ గుహాలయాల కాలము, నిర్మాతల విషయములలో నేటికిని భిన్నాభిప్రాయములు కొనసాగుచునే యున్నవి. కాని పురాణాలు మొదలగు ప్రాచీన గ్రంథాల నుండి తీసుకొనిన పల్లవ గుహాలయ వాస్తు శిల్ప రీతులు ప్రభావము వీటి ద్వారపాలకులు, పూర్ణఘట మొదలగు చిహ్నములలో మనకగుపడును.

ఆంధ్రుల చరిత్ర చాల ప్రాచీనమైనది. వేద యుగానంతర కాలమున రచింప బడిన ఐతరేయ బ్రాహ్మణ గ్రంథమున వింధ్యకు దక్షిణాన గల ఆర్య సరిహద్దుకు అవతల గల భూభాగముల గూర్చి, అచటి తెగల గూర్చి, తెలుప బడి యున్నది. అట్టి తెగలలో ఆంధ్రులొకరనెడి విషయము గూర్చి కూడా, ఇందు మొట్టమొదట ప్రస్తావించబడి యున్నది. సూత్ర సాహిత్యము మరింత స్పష్టముగా దక్షిణాపథము, దక్షిణాత్యుల గూర్చి తెలుపుతున్నది. కానీ ప్రాచీన బౌద్ధ మత గ్రంథాలు ఈ ప్రాంతమందలి అష్మాక, ములక, అంధక (అనగా ఆంధ్ర) జాతుల గూర్చి పూర్తిగా స్పష్టము చేయుచున్నది. శాసనాలలో ఆంధ్రుల గూర్చి అశోకుని శాసనాలలోనే మొదట తెలుపబడి యున్నది. తొలి చారిత్రక కాలానికి చెందిన శాతవాహనుల కాలముననే ఆంధ్రులు శక్తి వంతమైన విశాల రాజ్య స్థాపన, ప్రాభవములు జరిగి వాస్తు శిల్ప రంగమున ప్రాథమిక మేళిక ( substantial) ఘన కార్యములు సాదించబడినవి.

దక్కన్ ప్రాంతముననే మత పరమైన వాస్తు అభివృద్ధి అధికముగా సాగినది. బౌద్ధమతం గంగా మైదాన ప్రాంతమున పుట్టినప్పటికి, ఈ మత గుహాలయాలు అశోకుని కాలాన బీహారులో బరాబర్, నాగార్జుని, సితామర్హి ప్రాంతాన రూపొందించబడినప్పటికి, ఈ మత తొలి శిల్ప వాస్తు నిర్మాణాలు అధ్భుతముగా బార్ హుత్, సాంచి వంటి ప్రాంతాలలో మధ్య దేశముననే జరిగినవి. ఈ స్థితివలన ఒక వైపు శిలా గుహాలయాలు మరొక వైపు తొలి వేద కాలమునుండి కొనసాగుచున్న ఇటుక ఆలయ నిర్మాణాలు వాస్తు రీతిలో కొనసాగినవి. దక్కన్ లో శాతవాహనులు వారి తరువాతి వారైన ఇక్ష్వాకులు అమరావతి, నాగార్జున కొండ, గోలి, ఘంటసాల మొదలగు ప్రాంతాలలో ఇటుకతో నిర్మాణాలను (శిలా గుహాలయాల నిర్మాణాల అంతిమ కాలమున) ప్రారంభించిరి. అనువైన ప్రాంతాలలో శిలా గుహాలయాలను గూడ ఈ రాజులు నిర్మించ సాగిరి. కాని శిలా ఖండములు లభించని ప్రాంతాలలో ఇటుకతో నిర్మించ బడిన బౌద్ధ, హిందూ నిర్మాణాలు విస్తృతముగా ఇదే సమయమున వ్యాప్తి చెంద సాగెను. ఈ వ్యాప్తి దశకు చెందినవే ఉత్తరాన గంగా తీరమందలి తొలి గుప్త దేవాలయాలు. దక్కన్ లోని నాగార్జున కొండ, నాచ్ నకుథార బితర్గాన్ లందలి తొలి దేవాలయాలు.

కట్టడ నిర్మాణాలలో ఇటుక బదులు శిల వాడకము ప్రారంభమగుటకు మునుపే ఏక శిలా గుహాలయాలు రూపొందించుట తిరిగి ప్రారంభమైనది. కే.వి. సౌందర రాజన్ అన్నట్లు..... before brick could be replaced entirely by stone, the vogue had changed again transiently in favor of bock cut architecture , primarily due to the fact that the rock cut enterprise is not only more awe inspiring but also inevitably committed the labors and religious fervour of whole communities in the task and produced far reaching results in ethical and religious harmony. ప్రాంతీయ