పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దనకంఠరవములు వినవచ్చునట్లుగాఁ బరివాదినులు ముట్టి పాడుచుండుఁ
దనమోవిరుచికిఁ బైకొని వచ్చునట్లుగాఁ దియ్యనిఫలములు దెచ్చియిచ్చుఁ


తే.

దనకరాలింగనమునకుఁ దగులునట్లు, గా శరీరంబు మోవంగఁ గదిసి మ్రొక్కు
నిత్తెఱంగున నమ్మునిచిత్తవృత్తి, గలఁచి మదనాతురునిఁ జేసె కమలనయన.[1]

213


వ.

ఇవ్విధంబున మదనాతురుండై యమ్మునివరుండు.

214


తే.

పొలఁతి కెమ్మోవి చవిచూచి పొదలు గుబ్బ, గబ్బిపాలిండ్లు గదియంగఁ గౌఁగిలించి
సురతసుఖములఁ దనివోవఁ జొక్కకున్న, గాని పుషాస్త్రుచే బ్రతుకంగఁజాల.[2]

215


వ.

అని యయ్యింతికిఁ దనయభిప్రాయం బెఱింగించి యిట్లనియె.

216


తే.

తరుణి నీచేత మదనతంత్రంబు లెఱుఁగఁ, గోరి యున్నాఁడ నాయాస కొంచెపడక
యుండ సురతసుఖాంభోధి నోలలార్చి, యింపు సొంపార నన్ను మన్నింపవలయు.[3]

217


వ.

అనుటయు నయ్యింతి యమ్మునికాంతు నంతరంగంబునఁ గంతుకుంతంబులు నాటు
టెఱింగి యిట్లనియె.[4]

218


తే.

మీకు నామీఁద మిక్కిలి మేలు గలిగె, నేని దేవర యూడిగం బిచ్చవచ్చి
నట్లు గావింపకుండ నే నంతకుమతి, నయ్య మీచిత్త మెట్లుండె నట్ల నడతు.[5]

219


క.

అని యొడఁబడుటయు నమ్ముని, యనురాగము చెంగలింప నంబురుహనిభా
ననతోడి సురతసుఖమున, ననువై పెక్కేఁడులు నటనంబులు చేనెన్.[6]

220


వ.

ఇవ్విధంబున నయ్యిందువదనతోడి కందర్పరతిక్రీడానందంబులం జెంది మందర
గిరికందరంబున నూఱుసంవత్సరంబులు వినోదించుచున్నంత నొక్కనాఁడు.[7]

221


క.

చొక్కపుమరుమంత్రంబులఁ, జొక్కించి వినోదకేళిఁ జూపుచుఁ గళలిం

  1. కమ్మతావి = ఇంపైనసువాసన, పొలయున్ = వ్యాపించును - మెలఁగు ననుట, మోహనాకృతి = మోహమును కలిగించునట్టిరూపమును, బిబ్బోకముగన్ = బిబ్బోక మనువిలాసచేష్టతో, నటించున్ = మెలఁగును, పరివాదినులు = ఏడుతంతులవీణెలు, రుచికిన్ = చవికి, మోవంగన్ = తాఁకునట్లు, కలఁచి = కలఁత నొందించి.
  2. కెమ్మోవి = ఎఱ్ఱనిఅధరము, పొదలు = వర్ధిల్లు, తనివోవన్ = తృప్తికలుగునట్లుగా, చొక్కక = పరవశత్వము నొందక, పుష్పాస్త్రుచేన్ = మన్మథునిచేత.
  3. ఓలార్చి = ఈఁదునట్లుగాఁ జేసి, సొంపారన్ = సంతోష మతిశయించునట్లుగా.
  4. అంతరంగంబునన్ = మనసునందు, కంతుకుంతంబులు = మన్మధునియీఁటెలు.
  5. మేలు = మంచి - అపేక్ష యనుట, దేవరయూడిగంబు = దేవరవారియొక్క సేవ, కుమతినయ్య = కొంచెపుబుద్ధి గలదాననా - బుద్ధిహీనురాలనా.
  6. చెంగలింపన్ = అతిశయింపఁగా, ననువై = అనురాగము గలిగి, నటనంబులు చేసెన్ = నటించెను.
  7. కందర్పరతిక్రీడానందంబులన్ = కామాసక్తితోడి కేళివలని సంతోషములను, కందరంబునన్ = గుహయందు.