పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

సరసిజాయతలోచనజఘనయుగము, మరునిరథచక్రములతోడ మాఱుమలయ
మేఘమండలిలోనుండి మెఱుఁగుదీఁగె, వెడలివచ్చినకైవడిఁ బుడమికి డిగి.[1]

206


క.

వనజాక్షి కాంచె నపు డ, త్యనుపమతేజఃప్రభాసితాంబుజబంధున్
జనవిమతసత్యసంధుని, ననవరతానూనచిత్సుధాంధున్ గంధున్.[2]

207


మ.

అతులధ్యానపరాయణత్త్వమున బ్రహ్మానందుఁడై యున్నయా
క్షితిదేవోత్తముఁ జేరఁగా వెఱచి యాశీతాంశుబింబాస్య యు
న్నతపీఠస్తనభారనమ్ర యగుచు న్వర్తించె నాళీజనా
న్వితయై తద్వనవాటికాచయములన్ లీలావినోదంబులన్.[3]

208


క.

ఆకాంత చెలులతో బి, బ్బోకవినోదములవలనఁ బుష్పాపచయా
నేకానోకహవనకే, ళీకౌతుకవృత్తి మదిఁ దలిర్పఁగ నుండెన్.[4]

209


వ.

అప్పుడు.

210


మ.

మలయక్ష్మాధరకూటదంతురశిలామార్గంబులన్ డస్సి త
ద్విలసన్నిర్ఝర వరిదీర్ఘకలలో విశ్రాంతిఁ గావించి పు
ష్పలతామంజులకుంజపుంజముల నిచ్ఛావృత్తి వర్తించుచున్
బొలసెన్ దక్షిణవాతపోతములు సంపూర్ణప్రమోదంబునన్.[5]

211


వ.

ఇట్లు మనోహరం బైనసమయంబున.

212


సీ.

తనశరీరము కమ్మతావి మూర్కొనునట్లుగా వినోదమునఁ బైగాలిఁ బొలయుఁ
దనమోహనాకృతిఁ గనుఁగొనునట్లుగా ముందర బిబ్బోకముగ నటించుఁ

  1. బింకపుగుబ్బపాలిండ్లు = బిగువైన గుబ్బలవంటి స్తనములు, కంతునిగిరిదుర్గములతోడన్ = మన్మథునియొక్క పర్వతదుర్గములతో, (దుర్గము = ఇతరులకు చొర నశక్యమైనకోట), నిడువాలు = మిక్కిలిదీర్ఘములైన - మిక్కిలి విశాలమైన అనుట, క్రొవ్వాఁడి= క్రొత్తగా చేయఁబడిన వాఁడిమిగల, సౌరు = అందము, శంబరవైరి =మన్మథునియొక్క, నిడువాలువాలుతోన్ = మిక్కిిలినిడుపైన కత్తితో, నెయ్యమాడన్ = చెలిమి సేయఁగా, భ్రూయుగము = కనుబొమలజంట, అంగజాతుని = మన్మథునియొక్క, సింగిణివింటికిన్ = శృంగధనుస్సునకు, ఒఱపు = నాగరికతను, జఘనయుగము = పిఱుఁదులజంట (ఇచ్చట రథచక్రములతో పోల్చియుండుటచేత జఘనశబ్దమునకుఁ గలమడికట్టు అని అర్థమును మాని పిఱుఁదులు అని వ్రాయనయ్యెను.), మాఱుమలయన్ = ప్రతిఘటింపఁగా.
  2. అనుపమ...అంబుజబంధున్ = ఈడు లేని తేజస్సుచేత వెలుఁగుచున్న సూర్యుఁడైనవానిని, అనవరత...సుధాంధున్ = ఎడతెగక తక్కువకాని జ్ఞానామృతమును పానము చేయువానిని.
  3. అతులధ్యానపరాయణత్వమునన్ = సరిపోల్చరానిధ్యానమునందు ఆసక్తికలవానికరముచేత, బ్రహ్మానందుఁ డై = బ్రహ్మానందము కలవాఁడై, క్షితిదేవోత్తమున్ = బ్రాహ్మణశ్రేష్ఠుని, శీతాంశుబింబాస్య = చంద్రబింబమువంటి ముఖము గలది, ఉన్నత...నమ్ర = నిక్కినవియు బలిసినవియు నైన స్తనములవలని బరువు చేత వంగినది, వర్తించెన్ = ఉండెను, ఆళీజనాన్విత = చెలికత్తెలతో కూడుకొన్నది, తద్వనవాటికానిచయముల = ఆవనపఙ్క్తులసమూహములందు.
  4. బిబ్బోకము = స్త్రీవిలాసచేష్టావిశేషము, పుష్పా...వృత్తిన్ = పువ్వులు కోయుచు పెక్కువృక్షములు గలవనములో విహరించుటయందలి వేడుక గలిగిన వ్యాపారము.
  5. మలయమార్గంబులన్ = మలయపర్వతపుశిఖరములయందలి మిట్టపల్లములైన ఱాళ్లదారులయందు, తద్విలస...దీర్ఘకలలోన్ = ఆగందపుకొండయందలి యొప్పిదములైన సెలయేటినీళ్లచే నిండిననడబావులలో, విశ్రాంతిఁ గావించి = బడలిక దీర్చుకొని, పుష్ప...పుంజములన్ = పూఁదీఁగెలచేత మనోజ్ఞములైన పొదరిండ్లగుబురులందు, ఇచ్ఛావృత్తిన్ = ఇచ్చ వచ్చినవ్యాపారముతో, వర్తించుచున్ = మెలఁగుచు, పొలసెన్ = ప్రసరించెను, దక్షిణవాతపోతములు = దక్షిణదిశనుండి వచ్చునట్టి పిల్లవాయువులు - చల్లగాలి యనుట.