పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మంత్రంబు లనుష్ఠించుచు వేనునియూరుదేశంబు మథియింపఁ దొడంగి రప్పుడు.[1]

133


ఉ.

కాలినమోటువంటికొఱగానిశరీరము పల్లవెండ్రుకల్
గ్రాలెడుబూచిగడ్డమును ఖల్వటకంబును నీరెలుంగునన్
బేలగుమూఢవాక్యములు బీఱనరంబులతోడికుక్షియున్
దూలెడువక్రదంతములనోరును గల్గి యొకండు పుట్టినన్.[2]

134


క.

మునులెల్ల వెఱఁగుపడి తనుఁ, గనుఁగొనుచుండంగ వాఁడు గలఁగుచు నే నే
పని యొనరింపుదుఁ జెప్పుం, డనుటయు నందఱు నిషీద యని యుడుపుటయున్.

135


వ.

అది నిమిత్తంబుగా వాఁడు నిషాదుం డనునామంబునం బరఁగె నట్టినిషాదుని
నృశంసాకారం బుపలక్షించి వీఁడు రాజ్యపరిపాలనంబున కర్హుండు గాఁడని విం
ధ్యదేశవనశైలంబుల మ్లేచ్ఛకిరాతాధిపత్యంబునకుఁ దగుదు వం దరుగు మని
నియమించి పంచిరి. ఇట్లు వేనునిశరీరంబున నున్నపాతకంబు నిషాదరూపంబై
తదీయదేహద్వారంబున వెడలె నంత నమ్మహీపతిదురితరహితశరీరంబునందు ద
క్షిణభుజంబు సమందానందంబున నుచాత్తానుదాత్తస్వరితప్రచయంబులు గల
వేదమంత్రంబు లనుష్ఠించుచు మథియించిన.[3]

136

పృథుచక్రవర్తిచరిత్రము

శా.

అక్షీణప్రకటప్రతాపనిధి బాహాగర్వదుర్వారశ
త్రుక్షోణీశభయంకరుండు సుజనస్తోత్రుండు సర్వంసహా
రక్షాదక్షుఁడు విష్ణుమూర్తి పృథుఁ డుగ్రస్ఫారతేజంబుతో
సాక్షాదగ్నియుఁబోలె వేనునిభుజస్తంభారణిం బుట్టినన్.[4]

137


ఆ.

పుష్పవృష్టి గురిసె బోరన దేవదుం, దుభులు మ్రోసె జగము లభినుతించె
గరుడఖచరసిద్ధగంధర్వపన్నగ, పతులు సంతసములఁ బరఁగి రపుడు.

138


వ.

ఇవ్విధంబున నుదయించి సంప్రా పయావనుండై వైన్యుండు మహనీయమ
హిమం దేజరిల్లుచుండె నంత.[5]

139


తే.

అతులకరవాలమును విల్లు నక్షయోగ్ర, బాణతూణీరయుగము నక్షీణవజ్ర

  1. ఊరుదేశంబు = తొడచోటు, మథియింపన్ = తరువ.
  2. బూచి = వికృతమైన, ఖల్వటకంబును = తలబట్టయు, ఈరెలుంగు...వాక్యములు = హీనస్వరముతో దైన్యమును దెలుపునట్టి తెలివిమాలిన మాటలు, బీఱ = పెద్దవైన, కుక్షి = కడుపు, తూలెడు = మీఁది కెగసిన - మిట్టలైన
  3. నృశంసాకారంబు = ప్రాణిహింస చేయువాని యాకృతివంటి యాకృతి, ఉవలక్షించి = చూచి.
  4. అక్షీణ...నిధి = తఱుఁగని ప్రసిద్ధమైన పరాక్రమమునకు గనియైనవాఁడు, బాహా...భయంకరుండు = భుజగర్వముచేత అణంపరానిశత్రు రాజులకు భయమును కలుగఁ జేయువాఁడు, సుజనస్తోత్రుఁడు = మంచివారిచేత పొగడఁబడువాఁడు, సర్వంసహారక్షాదక్షుఁడు = భూమిని రక్షించుటకు చాలినవాఁడు, ఉగ్రస్ఫారతేజంబుతోన్ = భయంకరమై యతిశయించిన తేజస్సుతో, భుజస్తంభారణిన్ = స్తంభమువంటి చేయియనెడు ఆరణియందు. (ఆరణి = అగ్నికొఱకు తరువఁబడుమాను).
  5. వైన్యుఁడు = వేనునివలన జనించినవాఁడు, మహనీయ = పూజ్యమైన.