పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కప్పిన కోపాగ్నిశిఖల్, ముప్పిరిగొనఁ గలుషవాక్యములు దమలోనన్.

118


మ.

మునిలోకస్తుతిపాత్రుఁ డైనకరుణామూర్తిన్ హరిన్ బద్మలో
చను నిందించిన పాపకర్ముఁడు మహిన్ సామ్రాజ్యభోగంబుఁ గై
కొనఁగా నర్హుఁడు గాఁడు వీని నతులక్రోధాగ్నిచేఁ జంపి లో
కనిరూఢం బగుధర్మ మొంద మఖముల్ గావింత మత్యున్నతిన్.

119


క.

అని నిశ్చయించి దర్భలు, గొని మారణమంత్రములను ఘోరతరముగాఁ
జొనిపిన దివ్యాస్త్రము లై, మునుకొని యానృపతిదేహమున నాటుటయున్.[1]

120


క.

దేవబ్రాహ్మణనిందలు, గావించినయతఁడు పాపకర్మపరుండై
జీవంబు విడిచె ధరణీ, దేవత లానందవార్ధిఁ దేలిరి వేడ్కన్.

121


వ.

ఇట్లు విగతజీవుం డైనవేనునికళేబరంబు తైలపాకంబు చేయించి యవనీరా
జ్యంబుఁ బాలింపఁ బ్రధానుల నియమించి మహీసురవరులు తదీయవంశసంభ
వుండు బలపరాక్రమధురీణుండు పరమధర్మశీలుండు విష్ణుభక్తిపరాయణుండు
నైనరాజు నెవ్వని నభిషిక్తుం జేయుద మని విచారించుచున్నసమయంబున.[2]

122


సీ.

బలిమితో దుర్గాధిపతు లొండొరులతోడఁ బోరాడి తమలోనఁ బొలిసి చనిరి
హావళిమూకలై యాడకాడకుఁ గుట్రమన్నీలుసాదులు మన్ని గొనిరి
చోరసంచయ మగ్రహారముల్ బందెలు పట్టి సమస్తసంపదలు గొనియె
నాకతాయలు మూఁకలై దేశమంతయుఁ జెఱిచి పుణ్యస్త్రీల చెఱలుగొనిరి


తే.

దండు తఱచున ధారుణీమండలమున, వివిధధనధాన్యసస్యము ల్వీటివోయెఁ
బ్రజలు వనవాసములు చేసి భంగపడిరి, యవనియందు నరాజకం బైనకతన.[3]

123


వ.

ఇవ్విధంబున నరాజకం బైనకతన రాజవిడ్వరంబున రాజ్యంబునఁ బ్రజానాశం
బయ్యె నప్పుడు.[4]

124


తే.

రాజు లేని రాష్ట్రంబునఁ బ్రజల కెట్లు, నిర్వహింపంగ నగునని నిర్జరులకు
ధరణి మొఱపెట్టఁబోవు చందమున నెగసె, నిబిడతరమైన పెంధూళి నిఖిలదిశల.[5]

125


తే.

రేణుపటలసంఛన్నగీర్వాణపదవి, లోకనాలోలమానసులును మహాద్భు

  1. మారణ = చంపునట్టి, ఘోరతరముగాన్ = మిక్కిలి భయంకరముగా, చొనిపినన్ = (వానియందు) చొప్పింపఁగా- ప్రయోగింపఁగా.
  2. కళేబరము= దేహము, తైలపాకంబు చేయించి = నూనెలో ప్రేల్పించి, ప్రధానులన్ = మంత్రులను, విచారించుచున్ = ఆలోచించుచు.
  3. దుర్గాధిపతులు = పాళెపట్టు
    దొరలు, హావళి = ఉపద్రవము, కుట్రమన్నీలు = కుత్సితులైన సామంతరాజులు, మన్నిగొనిరి = చంపిరి, బందెలు = బందిపోట్లు, ఆకతాయలు = ధూర్తులు, మూఁకలై = గుంపులు కూడి, పుణ్యస్త్రీలన్ = ఇల్లాండ్రను, దండుకఱుచునన్ = సేనాబాహుళ్యముచేత, వీటిఁ బోయెన్ = నశించెను, అరాజకము = రాజు లేనిది - ఇక్కడ రాజులేమి యని యర్థము.
  4. రాజవిడ్వరంబునన్ = రాజులవలని యుపద్రవముచేత.
  5. రాష్ట్రంబున = రాజ్యమునందు, నిర్జరులకు = దేవతలకు, నిబిడతరము = మిక్కిలిదట్టము, పెంధూళి = మిక్కుటమగుదుమ్ము.