పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


త్కృపచెడి దుష్టకర్మములఁ గిల్కొనె దేటికి వేద మొల్ల వే
ల పరమవైష్ణవంబును దొలంగితివేమి నరేంద్రనందనా.[1]

110


తే.

ఆప్రసాదంబు ననృతంబు నాదియైన, రాజదోషంబు లేల తిరస్కరింప
వఖిలదేవతాప్రీతిగా నార్యజనులు, మెచ్చఁ గ్రతువులు నడప వేమిటికి నధిప.[2]

111


చ.

క్రతువులు చేసినన్ సురనికాయము సంతసమందుచుండు దే
వత లతితృప్తు లైన మహి వానలు గల్గు సువృష్టి గల్గినన్
క్షితి బహుసస్యసంపదలఁ జెన్నగుఁ బంటలచేత మర్త్యు లు
న్నతి వహియింతు రందు నరనాథుఁడు సుస్థితిఁ గాంచు నెప్పుడున్.[3]

112


వ.

అదియునుంగాక యజ్ఞంబులు చేయురాజ్యంబుల యజ్ఞమూర్తి యైననారాయ
ణుండు ప్రత్యక్షంబై యుండుఁ బుండరీకాక్షుఁడు విహరించురాష్ట్రంబున ఫల
సస్యసమృద్ధియు గోతురంగమాతంగాదిమహిమలుం గలుగుం గావున యజ్ఞం
బులు రాజులకుఁ గల్యాణకారణంబులు భవదీయవంశకర్త లైనరాజులచరిత్రం
బులు దలంచి ధర్మంబులు నిలుపుము యజ్ఞంబులు గావింప ననుజ్ఞ యిమ్మనినం
గోపించి వేనుండు మునీంద్రులతో నిట్లనియె.[4]

113


క.

నాకంటే నధికుఁ డెవ్వఁడు, లోకంబునఁ గలఁడు విష్ణులోకోత్తరుఁ గాఁ
జేకొని చెప్పెదరే యవి, వేకంబున మీర లిట్టి వెఱ్ఱులు గలరే.

114


తే

బ్రహ్మవిష్ణుమహేశ్వరప్రముఖులైన, దేవతలయంశములచేత దేజరిల్లి
భూమి పాలించుకొఱకునై పుట్టినాఁడ, నేను నాకంటె దైవంబు లెంత పెద్ద.[5]

115


తే.

భర్తృశుశ్రూష కాంతకుఁ బరమధర్మ, మయినవిధమున నాయాజ్ఞ నఖిలజనులుఁ
బూని నడచుట ధర్మంబు దీని నెఱిఁగి, కాదె మాన్చితి ధరలోనఁ గ్రతువులెల్ల .[6]

116

మునులు వేనుని శపించుట

తే.

అనిన మునినాథులందఱు నంగసుతునిఁ
బ్రియము పుట్టంగఁ బ్రార్థించి పెద్దఁ జేసి
యెన్ని చెప్పిన నన్నిటి కన్ని చెప్పి
దేవతానింద యొనరించి ధిక్కరించె.

117


క.

అప్పుడు మునివరు లందఱు, నప్పాపాత్మకునివలన నవమానితులై

  1. సాగనీవు = జరగనియ్యవు, పాపపతులన్ = పాపకృత్యములు చేయునట్టిరాజులను, కీల్కొనెదు = అంటెదవు - అవలంబించెదవు.
  2. అప్రసాదంబు = మొగము ముడుచుకొనియుండుట, రాజదోషంబులు = రాజులవలని లోపములు, క్రతువులు = యజ్ఞములు.
  3. నికాయము = సమూహము, సువృష్టి = మంచివాన, చెన్నగున్ = అందమగును - ఒప్పును, ఉన్నతిన్ = గొప్పను, సుస్దితిన్ = మంచియునికిని.
  4. యజ్ఞమూర్తి = యజ్ఞస్వరూపుఁడు, గోతురంగమాతంగాదిమహిమలు = ఆవులు గుఱ్ఱములు ఏనుఁగులు మొదలగువానికలుములు, కల్యాణకారణంబులు = మేలు గలుగుమూలములు.
  5. ఎంత పెద్ద = ఎంతగొప్ప- హెచ్చు కాదనుట.
  6. భర్తృశుశ్రూష = పెనిమిటియొక్క సేవ, కాంతకున్ = ఆఁడుదానికి - భార్యకు ననుట.