పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ర్వురు పుట్టిరి. అందు నంగునకు మృత్యుపుత్రి యగు సునీథయందు వేనుండు
పుట్టె.[1]

96


చ.

జననుత వేనుదక్షిణభుజంబు మునుల్ మధియింపఁగాఁ బృథుం
డనునరనాయకుం డుదయమై జనలోకము బాహువిక్రమం
బొనరఁగ నేలి భూవలయ మున్నతి ధేనువుఁ జేసి దుగ్ధదో
హన మొసరించి తన్పె సచరాచరభూతములం బ్రియంబుతోన్.[2]

97


చ.

అనవుడు శిష్యుఁ డగ్గురున కంజలి చేసి మహాత్మ యమ్మహా
మునివరు లేల వేనుభుజమున్ మథియించిరి యాపృథుండు దా
జననము నొందు టెట్టులు రసాసతి ధేనువుఁ జేసి లోకముల్
గెనయఁగ నేల పాలు పిదికెన్ వినిపింపుము నాకు నేర్పడన్.[3]

98


వ.

అనినం బరాశరుం డిట్లనియె.

99

వేనునిచరిత్రము

ఉ.

అంగుఁడు మృత్యుపుత్రి యగునట్టిసునీథను బెండ్లి యాడి య
య్యంగనయందు వేనుఁ డనునాత్మజునిం గని రాజయోగ్యభో
గాంగము లైనభాగ్యములు కాతని పట్టము గట్టుచుం దప
స్సంగతి నేగె నానృపతిసత్తముఁ డాలును దానుఁ గానకున్.

100


క.

మాతామహదోషంబున, నాతఁడు రాజ్యంబు సేయునప్పుడు పుణ్యో
పేతక్రియ లొనరింపక, పాతకములు సేయుచుండె బహుగర్వమునన్.

101


సీ.

ఆదికాలమునాఁటియగ్రహారంబులు బందెలు గల్పించి పాడు సేయు
నన్యాయమున విత్త మార్జించి పరలోకసాధనంబులు గానిజాడ నొసఁగు
వేదాంతవిదు లైన విద్వజ్జనంబుల వెదకించి దేశంబు వెడల నడుచు
వరశుభప్రద మైనవైష్ణవధర్మంబు మఱచి పాషండధర్మముల నడపు


తే.

జారచోరదురాచారసమితిఁ బ్రోచు, ననృతమును నాస్తికతయును బెనుచుచుండు
ధర్మ మొల్లఁ డతిక్రూరదండనంబు, సాధుజనులందుఁ గావించు జనవిభుండు.[4]

102


చ.

శ్రుతులు పరిత్యజించి విధిచోదితకర్మము లుజ్జగించి సు
వ్రతములు గట్టిపెట్టి గరువంపుఁదపంబులు వీటిఁబుచ్చి స
త్క్రతువుల యాస మాని సతతంబును దన్నునె కొల్వుఁడంచు నా

  1. పదుండ్రు = పదిమంది.
  2. మథియించఁగా = తరువఁగా, దుగ్ధదోహనము = పాలు పిదుకుటను, తన్పెన్ = తనియించెను - తృప్తి నొందించెను.
  3. అంజలి = చేమోడ్పు, రసాపతి = భూదేవి, గెనయఁగన్ = తనియఁగా.
  4. బందెలు = పన్నులు, పాషండధర్మములు = వేదవిరుద్ధాచారములు, జారచోర...సమితిన్ = విటులయొక్కయు దొంగలయొక్కయు చెడునడవడికలవారియొక్కయు గుంపును, నాస్తికత = దేవుఁడు లేఁడనుతలఁపు.