పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


పొదవుధ్రువస్థానం బు, న్నది యచ్చో టిత్తు నీకు నరవరపుత్రా.[1]

89


క.

అమ్మహనీయపదంబున, సమ్మదమున నీవు మాతృసహితుఁడవై మో
దమ్మును నొందుచు నుడురూ, పమ్మున విలసిల్లు కల్పపర్యంతంబున్.[2]

90


క.

అంతంబున మోక్షము న, త్యంతగరిమతోడ నిత్తు ననుచు ధరిత్రీ
కాంతసుతుఁ బలికి దేవుం, డంతర్నంబు నొందె నాసమయమునన్.[3]

91


క.

నరనాథసుతుఁడు దనుజా, మరకిన్నరసిద్ధసాధ్యమహితస్తుతులం
బరఁగుచు జననియుఁ దానును, సరసవిమానంబు లెక్కి చనిరి మహిమతోన్.

92


వ.

ఇవ్విధంబున సూర్యమండలంబునకుం జని సూర్యునిచేతఁ బూజితుండై చంద్ర
మండలంబుఁ బ్రవేశించి చంద్రునిచేత సంభావితుండై నక్షత్రమండలంబునకుఁ
బోయి నక్షత్రరూపంబుల నున్న పుణ్యవంతులచేతఁ బ్రీణితుండై బుధమండలం
బున కరిగి బుధారాధనశీలుండై శుక్రమండలంబుఁ బ్రవేశించి యతనిచేత
స్తోత్రంబులు గొని యంగారకమండలంబుఁ జొచ్చి యతనివలనఁ దేజోలాభం
బునుం బొంది బృహస్పతిమండలంబున నిలిచి తదీయగౌరవంబున కర్హుండై శనై
శ్చరమండలంబు దర్శించి యతనిచేత ననుగ్రహంబు వడసి సప్తర్షిమండలంబుఁ
జూచి వారలవలన మహనీయమహిమలు గాంచి.[4]

93


క.

చని ధ్రువలోకంబున న, త్యనుపమసౌభాగ్యయుక్తుఁడై లోకంబుల్
దనక్రిందను వర్తింపఁగ, ననుపమసంపదల నేఁడు నందెడు గరిమన్.

94


క.

మానుగ నీధ్రువచరితము, మానవు లెవ్వారు వినిన మహనీయయశ
శ్శ్రీనిరతి నొందుదురు మఱి, స్థానభష్టతయు లేక తనయులుఁ దారున్.

95


వ.

అట్టిద్రువుండు శంభు వనుభార్యయందు శిష్టియు భవ్యుండు ననుపుత్రద్వ
యంబుఁ బడసె నందు శిష్టి యనువాఁడు సుచ్ఛాయ యనుభార్యయందు రిపుం
డును రిపుంజయుండును విప్రుండును వృకలుండును వృకతేజుండును ననువారి
నేవురం బడసె నందు రిపునకు బృహతి యను దానియందుఁ జాక్షుషుండు పుట్టె
వానికి వరుణవంశజాత యైన పుష్కరిణి యనుదానియందుఁ జాక్షుషమనువు
పుట్టె వానికి వైరాజప్రజాపతిపుత్రి యైనసడ్వల యనుదానియందు నూరుం
డును బూరుండును శతద్యుమ్నుండును తపస్వియు సత్యభాక్కును శుచియు
నగ్నిష్టోముండును నతిరాత్రుండును సుద్యుమ్నుండును నభిమన్యుండును నను
పదుండ్రు పుట్టి రందు నూరునకు నాగ్నేయి యనుదానియందు నంగుండును
సుమనసుండును స్వాతియును క్రతువును నంగిరసుండును శిబియు ననునా

  1. త్రిదశ...పదములకున్ = దేవతలు గ్రహములు నక్షత్రములు ససమహర్షులు (వీరియొక్క) స్థానములకు, ఉపరిభాగంబునన్ = మీఁదిభాగమునందు, పెంపు = మేలిమి.
  2. మోదమ్మును = సంతోషమును, ఉడురూపమ్మునన్ = నక్షత్రాకృతితో, కల్పపర్యంతంబు = ప్రళయమువఱకు.
  3. గరిమ = గౌరవము, ధరిత్రీకాంతసుతున్ = రాజకుమారునితో.
  4. ప్రీణితుండై = సత్కరింపఁబడినవాఁడై.