పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

ఐనం జెప్పెదఁ జిత్తగింపుము మహాత్మా తండ్రి సింహాసనా
సీనుండై కొలువున్న నే నచటికిం జేరంగ నాసించితిన్
దానిం గన్గొని పెద్దతల్లి కినుకన్ ధట్టించి యిందుండ మ
త్సూనుం డర్హుఁడు గాని నీవు దగవంచున్ నన్నుఁ బల్కెన్ వెసన్.[1]

82


శా.

ఏ నవ్వాక్యము లాత్మలో నిలిపి లోకేశుండ వైనట్టినీ
చే నత్యున్నత మైనదివ్యపద మక్షీణప్రభావంబునుం
బూనన్ వచ్చితి నాకు నవ్వరము సంపూర్ణంబుగాఁ జేయవే
ధ్యానారూఢమునీంద్రహృత్కమలసద్మా పద్మపత్రేక్షణా.[2]

83


వ.

అనిన నద్దేవుండు నరదేవనందనునకుఁ గరుణారసకందళితహృదయుండై యి
ట్లనియె.

84

ధ్రువునిపూర్వజన్మవృత్తాంతము

సీ.

భూమీశనందన పూర్వజన్మంబున నీవు బ్రాహ్మణుఁడవై నిఖిలవేద
శాస్త్రంబులును నేర్చి సాధుసమ్మతిఁ గులాచారముల్ దప్పక జననియందు
జనకునియందును సద్భక్తి వదలక జపతపోనుష్ఠానసద్విధులను
నను నుపాసించుచు నాయందు లగ్నమై యున్నచిత్తంబుతో నుండి యుండి


తే.

యఖలసౌభాగ్యనిరతుఁడు నధికరూప, వంతుఁడును నవయౌవనవైభవుండు
నైనయొకరాజుతోడ సఖ్యంబు చేసి, యతనివంటి ప్రభుత్వము నాత్మఁ గోరి.[3]

85


తే.

ప్రాభవమునఁ గులస్థానపౌరుషములు, నాధిపత్యంబు గలిగినయట్టిరాజ
వరతనూజుఁడవై పుట్టవలయు ననుచు, నన్ను నారాధనము చేసినాఁడ వీవు.[4]

86


తే.

అదినిమిత్తంబు నీవు జన్మాంతరమున, వచ్చి కులశీలగుణవైభవములు గలిగి
నట్టియుత్తానపాదున కాత్మసుతుఁడ, వై జనించితి తొల్లిపుణ్యంబువలన.

87

ధ్రువుండు విష్ణుదేవునివలన ధ్రువస్థానంబుఁ బడయుట

మత్తకోకిల.

ఓకుమారక శైశవంబున నుల్లసిల్లుచు నుండియున్
మాకు భక్తుఁడవై తపోనియమవ్రతంబులు సల్పి య
స్తోకపుణ్యపరుండ వైతివి తొంటిజన్మము కోరికల్
నీకు నేడు ఫలించునట్లుగ నెమ్మితో వర మిచ్చెదన్.[5]

88


క.

త్రిదశగ్రహతారాముని, పదముల కన్నిటికి నుపరిభాగంబునఁ బెం

  1. చిత్తగింపుము = వినుము, ఆసించితిన్ = ఆశపడితిని, కినుకన్ = కోపముతో, ధట్టించి = ఉద్ధతిని
    పొంది.
  2. ధ్యానా...సద్మా = నిశ్చలధ్యానయుక్తులైన మునిశ్రేష్ఠులహృదయకమలములు ఉనికిపట్టుగాఁ గలవాడా.
  3. ఉపాపించుచు = సేవించుదు, లగ్నమై = అంటినదై.
  4. ప్రాభవమునన్ = ప్రభుత్వముతో - ఘనతతో, పౌరుషము = మగతనము - శూరత్వము, ఆధిపత్యము = అధికారము, ఆరాధనము చేసినాఁడవు = ఆరాధించితివి.
  5. శైశవంబునన్ = శిశుత్వమున - కడుబాల్యమున ననుట, ఆస్తోక = అధికమైన, నెమ్మితోన్ = ప్రేమతో.