పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే.

నభముతోఁ బ్రతియైన నెన్నడుమునందుఁ, గనకకౌశేయసాంధ్యరాగంబు మెఱయ
భక్తలోకైకరక్షణోపాయధుర్యుఁ, డై జనార్దనుఁ డపుడు ప్రత్యక్షమయ్యె.[1]

67


వ.

ఇట్లు ప్రత్యక్షంబై.


స్వాగతావృత్తము.

ఆనరేంద్రతనయాగ్రణియోగ, ధ్యానధారణవిధాననిధానం
బైనచిత్తము లయం బగుటెల్లం, దా నెఱింగి కృపఁ దార్కొనుదృష్టిన్.[2]

68


వ.

అతని నవలోకించి కుమారా నీతపోమహత్వంబునకు మెచ్చితి నీయిచ్చకు వచ్చిన
వరంబు లిచ్చెద వేఁడు మని తెలిపిన నతం డున్మీలితలోచనుండై.[3]

69


ఆ.

యోగదృష్టిచేత నోరంతప్రొద్దును, భావవీథిఁ గానఁబడినమూర్తి
బాహ్యదృష్టిఁ గానఁబడిన నిక్కంబుగాఁ, దలఁచి రాజసుతుఁడు తెలివి నొంది.[4]

70


వ.

భయభక్తితాత్పర్యంబులు చిత్తంబునం బెనంగొన సాష్టాంగదండప్రణామంబు
లు సేసి నిలిచి కరకమలంబులు మొగిచి.[5]

71


తే.

కమలలోచనురూపంబుఁ గన్నులారఁ, జూచి యానందరసకేళిఁ జొక్కి యతఁడు
తన్నుఁ దా నేమి యెఱుఁగనితలఁపుతోడ, నుండియును గద్దదస్వరయుక్తిఁ బలికె.[6]

72


క.

వరమిచ్చెద నని లక్ష్మీ, వర వచ్చితి నాకు నిన్ను వర్ణింప మనో
హరమై యున్నది యఘసం, హర మగువాక్ప్రతిభ నాకు నందింపఁగదే.[7]

73


చ.

అనుటయుఁ బద్మనాభుఁడు దయామృతపూరితదివ్యచిత్తుఁ డై
జనపతిసూతిమస్తమునఁ జారుతరోపనిషద్రహస్యసం
జనితమృదూక్తిసంఘ మగుశంఖము మోపిన నమ్మహాత్మునె
మ్మనము మహాప్రకాశమహిమం జెలువొందె ననేకభంగులన్.[8]

74


ఉ.

అప్పుడు రాజపుత్రుఁడు మహాప్రతిభావిభవాభిరాముఁడై
యప్పరమేష్ఠిముఖ్యులకు నైన నగమ్యము లైనయర్థముల్
చొప్పడ నాగమోక్తఘనసూక్తులఁ జేతులు మోడ్చి భక్తితో

  1. వారివాహము = మేఘము, శంప = మెఱపు, భూమిపద్మము = మెట్టతామర, చంచరీకము = తుమ్మెద, అరిశంఖఫలయుగంబు = చక్రము శంఖము ననెడు పండ్లయొక్క జత, ప్రతివచ్చు = సమానమగు, మోము = ముఖము, దరహాస... ధారలు = చిఱునవ్వనెడు క్రొత్తయమృతపుధారలు, నభముతోన్ = ఆకాశముతో, కనకకౌశేయసాంధ్యరాగము = పీతాంబరముయొక్క కాంతియనెడు సంధ్యారాగము.
  2. నిధానము = విధి, తార్కొను = చేరు - పొందు.
  3. వేఁడుము = కోరుము, ఉన్మీలితలోచనుఁడు = తెఱవఁబడిన కన్నులుగలవాఁడు.
  4. ఓరంతప్రొద్దును = ఎల్లప్పుడును, భావవీథిన్ = మనస్సునందు.
  5. తాత్పర్యము = తత్పరత్వము, మొగిచి = ముకుళించి.
  6. చొక్కి = పరవశుఁడై, తలంపుతోన్ = ఎన్నికతో - ధ్యానముతో.
  7. వాక్ప్రతిభన్ = మాటలకలిమిని, అందింపఁగదే = పొందింపుమా - కలిగింపు మనుట.
  8. పూరితము = నిండింపఁబడినది, జనపతిసూతిమస్తకమునన్ = రాజకుమారుఁడైన ధ్రువునిశిరస్సునందు, చారుతర...సంఘము = మిక్కిలిమనోజ్ఞములైన ఉపనిషత్తులలోని రహస్యములను పుట్టించెడు (తెలిపెడు) తిన్ననిమాటలయొక్క కూటమి గలది.