పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


హృదయములోన నిల్పి తప మిమ్ములఁ జేయుచు నున్నరాసుతున్
సదమలవృత్తిఁ బూన ధృతిచాలక భూమి వడంకె నొక్కటన్
విదితనదీనదాబ్ధిపృథివీధరఘోరవనాళి గూడఁగన్.[1]

43


తే.

ఒక్కపాదంబు ధర మోపి యూర్ధ్వబాహుఁ, డగుచు నుగ్రతపంబు సేయంగ నతని
పదముదిక్కు వసుంధరాభాగమెల్ల, నొరగు వారిధిలోని పేరోడవోలె.[2]

44

ఇంద్రుఁడు ధ్రువునితపము విఘ్నము చేయఁబూనుట

వ.

ఇట్లు సకలలోకక్షోభంబుగా నుగ్రతపంబు సేయునతనితపోవహ్ని సకలచరా
చరభూతంబులకు నసహమానం బయ్యె నప్పుడు.[3]

45


క.

దేవపతి యాము లనియెడు, దేవతలును దాను వాసుదేవధ్యాన
శ్రీవిభవుఁ డైనధ్రువునిత, పోవిఘ్నం బర్థిఁ జేయఁ బూని కడంకన్.

46


శా.

భూతప్రేతపిశాచరూపములతోఁ బొల్పారు కూశ్మాండక
వ్రాతంబుం బిలిపించి మీరు భయదవ్యాపారులై పోయి ని
ర్ఘాతక్రూరకఠోరఘోరరవముల్ గల్పించి యబ్బాలకున్
భీతుంజేసి తపంబు మాన్పుఁ డనుచుం బ్రేరేచినన్ ధీరులై.[4]

47


సీ.

చటులదంష్ట్రావిషజ్వాలాకరాళభీకరభుజంగంబులై కఱవవచ్చుఁ
గేసరిశార్దూలకిరిగండభేరుండరూపంబులై పొడచూపుచుండు
దైత్యపిశాచభూతప్రేతడాకినీసంరావములతోడ సందడించుఁ
జిటచిటార్భటిఁ బరస్ఫుటదావపావకకీలలఁ గ్రొమ్మంట లోలిఁ బొదవు

  1. ఇమ్ములన్ = సుఖముగా, రాసుతున్ = రాజకుమారుని, సదమలవృత్తిన్ = నిర్మలమైన వ్యాపారము గలవానిని, పూనన్ = వహింపను, ధృతి = ధైర్యము - ఓర్పు, విదిత... వనాళి = ప్రసిద్ధమయిననదులు నదములు సముద్రములు పర్వతములు భయంకరములైన అడవుల పఙ్క్తులును.
  2. ఊర్ధ్వబాహుఁడు = మీఁది కెత్తఁబడినచేతులు గలవాఁడు, పదముదిక్కు = కాలితట్టు, ఒరగున్ = మ్రొగ్గును, వారధి = సముద్రము, పేరోడ = పెద్దఓడ.
  3. క్షోభము = కలఁతపాటు, వహ్ని = అగ్ని, అసహమానము = సహించరానిది.
  4. పొల్పారు = ఒప్పునట్టి, కూశ్మాండకవ్రాతము = ఒకవిధమైన రాక్షసులయొక్క సమూహము, భయదవ్యాపారులు = భయంకరమైన వ్యాపారము గలవారు, నిర్ఘాత..రవములు = పిడుగును బోలినవియు హింసకములను కఠినములును భయంకరములునైన ధ్వనులను, భీతున్ = భయబడినవానిఁగా, ప్రేరేచినన్ = ప్రేరేపింపఁగా.