పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


యుండు నతండు దేవరూపంబు ధరించిన దేవతాస్త్రీరూపంబును మనుష్య
రూపంబు ధరించిన మనుష్యస్త్రీరూపంబును నై శబ్దంబు ననుసరించు నర్థంబు
నుంబోలె ననుసరించునని లక్ష్మీచరిత్రంబు చెప్పిన విని మైత్రేయుం డిట్లనియె.

211

భృగ్వాదిముని కర్తృకసృష్టిక్రమము

తే.

అనఘ భృగుమౌని యాదియైనట్టిమునుల, సర్గములు వేఱువేఱ విస్తారఫణితి
నానతిమ్మని పల్కిన నవ్వసిష్ఠు, మనుమఁ డిట్లని చెప్పె నమ్మౌనితోడ.[1]

212


క.

ఖ్యాతికి భృగునకుఁ బుట్టిన, ధాతవిధాతలును మేరుధరణీధ్రతనూ
జాతల నాయతనియతుల, నాతతమతిఁ బెండ్లి యైరి యం దాయతికిన్.[2]

213


తే.

ప్రాణుఁ డుదయించె నియతికి భవ్యమూర్తి, యగుమృకండుండు జనియించె నతనివలన
దురితహరుఁడు మార్కండేయవరమునీంద్రుఁ, డవతరించెను దీర్ఘాయు రమలుఁ డగుచు.

214


వ.

మఱియుఁ బ్రాణునకు వేదశిరుండును వానికి ద్యుతిమంతుండును అతనికి నజ
గుండునుం బుట్టిరి వారివంశంబు లసంఖ్యాతంబులై జగంబులు విస్తరిల్లె మఱి
యును.

215


తే.

విను మరీచికి సంభూతి యనులతాంగి, యందు నుదయించెఁ బౌర్ణమాసాఖ్యసుతుఁడు
పరఁగ నతనికి విరజుండు పర్వతుండు, ననఁగఁ బుత్రులు జన్మించి రతులయతులు.

216


తే.

అంగిరసునకు స్మృతియందు ననుమతియును, రాకయును సినీవాలియు నాఁ గుహువును
నాఁగ నలువురు పుట్టి నానాజగత్ప్ర, సిద్దమహిమలు గాంచి రక్షీణముగను.

217


క.

అత్రికి ననసూయకు స, త్పుత్రకులై చందురుండు దుర్వాసుఁడు ద
త్తాత్రేయుఁడుఁ బుట్టిరి శత, పత్రభవాభవరథాంగపాణులు దామై.[3]

218


వ.

మఱియుఁ బ్రీతి యనుదానికి దత్తాగ్ని పుట్టె నతండు స్వాయంభువమన్వంతరం
బున నగస్త్యుం డయ్యెఁ బులహునకు క్షమయును దానికి గర్ధముండును సహి
ష్ణుండు నూర్ధ్వరేతుండునుఁ బుట్టిరి. క్రతువునకు సన్నతి యనుదానికి నంగుష్ఠ
పర్వమాత్రదేహులు నూర్ధ్వరేతస్కులును నైనవాలఖిల్యాదు లఱువదివే
వురు పుట్టిరి. వసిష్ఠునకు నూర్జ యనుదానికి విరజుండును గోత్రుండును నూర్ధ్వ
బాహుండును సవనుండును ననముండును సుతవుండును శక్రుండును నన

  1. వరములు = సృష్టులు, ఫణితిన్ = పక్కికచేత.
  2. ధరణీధ్రము = కొండ.
  3. శతపత్ర...పాణులు = బ్రహ్మశివవిష్ణువులు.