పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నందరసపూరములు నిండఁగ నిలింపముని
              బృందములు పద్మజపురందరులతో నం
దంద చెలరేఁగుచు నమందగమనంబు లొద
              వం దిరిగి వచ్చి దితినందనులతోడం
బొందుపడ సంధి యొకచందమునఁ జేసి నిరు
              కందువలవారు నరవిందభవునాజ్ఞన్.[1]

173


క.

అమరాసురు లటఁ గాంచిరి, ప్రముదితగంధర్వయక్షవరకృతకేళీ
రమరమణీకందరమును, రమణీయమహేంద్రసుందరము మందరమున్.[2]

174


వ.

అమ్మహానగం బగలించి తెచ్చి.[3]

175


ఉ.

అవ్వనజాయతేక్షణునియానతిఁ జేసి మహౌషధీలతల్
జువ్వన నమ్మహాంబునిధిలోపల వైచి సురాసురావళుల్
కవ్వ మెలర్ప మందరము మంథముగా వెసఁ ద్రోచి వాసుకిం
గవ్వపుత్రాడు సేయ సమకట్టుచు నున్నతఱిన్ మునీశ్వరా.[4]

176


క.

ఆధరణీధర మడుగున, నాధారము లేక మునిఁగె నాసమయమునం
బాధరణీధరమర్దనుఁ, డాధరణీధరునిఁ దలఁచె నతులితభక్తిన్.[5]

177


వ.

ఇట్లు దలంచినసహస్రాక్షునకుఁ బుండరీకాక్షుండు ప్రత్యక్షంబై.[6]

178


సీ.

జలధిలో లక్షయోజనవిశాలంబైన కూర్మమై కవ్వపుకొండ యెత్తి
యాకాశభాగంబునందు శైలముమీఁద జడియకుండఁగఁ దనశక్తి నిలిపి
తరిత్రాడుగా నున్న యురగవల్లభునిగాత్రముఁ బ్రవేశించి సత్వంబు నొసఁగి
సమసత్వు లైనరాక్షసదివౌకసులలోఁ గలసి యెచ్చరికలు గలుగఁజేసి


తే.

యాదరంబున బ్రహ్మరుద్రాదిదివిజ, సమితితోఁ గూడి సుఖగోష్ఠి సలుపుచుండెఁ
దనమహత్త్వంబునకు సనందనవవత్సు, జాతసనకాదిమౌనులు సంతసిల్ల.[7]

179


ఆ.

భోగితలలపట్టు పూర్వదేవతలును, దోఁకపట్టు సురలు వీఁకఁ బట్టి
త్రచ్చునట్లు గాఁగ దామోదరుఁడు సమ, కట్టె వారివారికడల నిలిచి.[8]

180


క.

వాసుకిసహస్రముఖని, శ్వాసవిషోద్రేకచటులవహ్నిజ్వాలల్

  1. డెందముల = మనసులయందు, పూరములు = ప్రవాహములు, నిలింపమునిబృందములు = దేవతలయొక్కయు మునులయొక్కయు సమూహములు, పొందుపడన్ = సరిపడునట్టు, కందువ = స్థానము - తెగ.
  2. ప్రముదిత...కందరమును = సంతోషించిన గంధర్వులును యక్షులు నైనభర్తలకు చేయఁబడిన క్రీడచే మనోజ్ఞురాండ్రైన విలాసస్త్రీలుగల గుహలు గలదానిని.
  3. అగలించి = పెల్లగించి.
  4. జువ్వనన్ = జువ్వు అనుధ్వని కలుగునట్లుగా, మవ్వము = బాగు - పూనికయనుట, సమకట్టుచున్ = యత్నించుచు.
  5. ధరణీధరము = కొండ, ధరణీధరమర్దనుఁడు = ఇంద్రుఁడు, ధరణీధరుఁడు = విష్ణుఁడు.
  6. సహస్రాక్షుఁడు = ఇంద్రుఁడు.
  7. కవ్వపుకొండ = మందరపర్వతము, జడియకుండఁగన్ = తొలఁగకుండ, తరిత్రాడు = కవ్వపుత్రాడు, ఉరగవల్లభుని = సర్పరాజుయొక్క - వాసుకియొక్క, గాత్రమున్ = దేహమునందు, సత్వంబు = శక్తిని, దివౌకసులు = దేవతలు.
  8. భోగి =సర్పము, వీఁకన్ = పూనికతో.