పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


లాలితశ్రీవత్సలాంఛనలాంఛితుఁ గౌస్తుభగ్రైవేయకప్రభావు
నిందిరామందిరాయితపీనవక్షునిఁ దారుణ్యకోటికందర్పమూర్తి


తే.

బుండరీకాక్షుజగదేకపూతచరితు, సతతకరుణాకటాక్షవీక్షణు సమస్త
యోగినిర్మలహృదయపయోజనిలయు, విష్ణుఁ బొడ గాంచి సంతోషవివశు లగుచు.[1]

166


వ.

పంకజాసనప్రముఖదేవతలు సంభ్రమభయభక్తితాత్పర్యంబులు చిత్తంబులం బెనం
గొనఁ బునఃపునఃప్రణామంబులు సేయుచున్నసమయంబున నత్యంతవిషాదవేదనం
బొగులుచున్న యింద్రునకు నింద్రావరజుం డిట్లనియె.

167


తే.

ఏమి దేవేంద్ర యెన్నఁడు లేమి నీవు. చిన్నవోయినమోముతో నున్నవాఁడ
వకట బ్రాహ్మణక్షోభ నీ కయినయట్లు, తేటపడుచున్న దిది యేమొ తెలుపు మనిన.

168


క.

కోపనుఁ డగుదుర్వాసుని, శాపంబున దివిజరాజ్యసంపద లెల్లన్
రూపఱినచంద మబ్జజుఁ, డాపురుషోత్తమునితోడ నంతయుఁ జెప్పెన్.[2]

169


వ.

ఇట్లు చెప్పి దేవా దీనికిఁ బ్రత్యుపాయం బెయ్యది యానతియ్యవలయు నని
ప్రార్థించినఁ గరుణాతరంగితలోచనుండై పరమేశ్వరుండు నిర్జరేశ్వరు నవ
లోకించి యిట్లనియె.

170


సీ.

ఈవు దిక్పతులతో నిప్పుడు ము న్నేగి కపటంపుసంధి రాక్షసులతోడఁ
జేసి వారును మీరు నాసహాయంబున నతిసత్వసంపన్నులై కడంగి
యోషధీలతలు దుగ్ధాబ్ధిలో వైచి మందరమహీకరము మంథంబుఁ జేసి
వాసుకిఁ దెచ్చి కవ్వపుత్రాడుగా నిడి మథియింపుఁ డమృతాదిమహితవస్తు


తే.

చయముతోఁగూడ, త్రైలోక్యసంపదలకుఁ గారణం బైనవిభవంబు గల్గు నమృత
పాన మొనరించెదవు దైత్యపతుల మొఱఁగి, నీవు లోకంబు లేలెదు నెమ్మితోడ.[3]

171


వ.

అని యానతిచ్చి వీడ్కొల్పిన నప్పుడు.

172

ఇంద్రుఁడు శ్రీమన్నారాయణాజ్ఞచే రాక్షసులతో గూడి సముద్రమథనంబు సేయుట

లయగ్రాహి.

మందరధరుండు దము నందఱఁ గృపాంబునిధి
              యందుఁ బొరయించె నని డెందముల సత్యా

  1. శతకోటిభాస్కరసందీప్తతేజునిన్ = నూఱుకోట్లసూర్యులు వెలుంగునట్లు వెలుఁగుతున్న తేజస్సుగలవానిని, ప్రావృట్పయోధరభవ్యగాత్రున్ = వానకాలపుమేఘమువలె (ఒప్పునట్టి) పూజ్యమైన దేహము గలవానిని, పీఠికౌశేయశోభితకటీరున్ = పచ్చపట్టుతాపితాచేత శోభించునట్టి కటిప్రదేశముగలవానిని, లాలిత...లాంఛితున్ = ఒప్పిదమైన శ్రీవత్సమనుమచ్చచేత గుఱుతుపెట్టఁబడినవాఁడు, ఇందిరా... పీనవక్షునిన్ = లక్ష్మీదేవికి ఇల్లుగా చేయఁబడిన విశాలమైనఱొమ్ముగలవానిని, కారుణ్యమూర్తిన్ = తరుణభావముతోడి కోటిమన్మథులరూపమువంటి రూపముగలవానిని, జగదేకపూతచరితున్ = లోకమునకు ఒక్కఁడైన పావనమైన నడవడిగలవానిని, సమస్త...నిలయున్ = ఎల్లయోగులయొక్క నిర్మలములైన మనఃపద్మములు ఉనికిపట్టుగాఁ గలవాఁడు, వివశులు = పరవశులు.
  2. రూపఱిన = నశించిన.
  3. మంథము = కవ్వము, మొఱఁగి = వంచించి.