పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సకలాశాపరిపూరితైకమహిమల్ సంధిల్లఁగాఁ గొంచు న
త్రికుమారుం డరుదెంచుమార్గమున నేతేరంగ దౌదవ్వులన్.[1]

133


మ.

కనియెన్ మౌని శరత్సుధాకిరణరేఖాసంగ్రహస్ఫూర్తిమై
ఘనతం బొల్చువిభావరీసతిగతిన్ గల్పద్రుమామ్లానపు
ష్పనిబద్ధాంచితదామముం గొని యథేచ్ఛన్ వచ్చువిద్యాధరిన్
వినుతానంగరతిప్రసంగమహిమావిర్భూతబింబాధరన్.[2]

134


చ.

పొడఁగని చేరఁబోయి మునిపుంగవుఁ డామదిరాక్షిచే బెడం
గడరెడుపువ్వుదండఁ బ్రియమారఁగ నిమ్మని సన్న చేసి త
న్నడిగిన మాఱువల్కఁగ భయంపడి చయ్యన నిచ్చి మ్రొక్కుచుం
బడఁతి నిజేచ్ఛ నేగెఁ బులిబారికిఁ దప్పినలేడికైవడిన్.[3]

135


క.

ఆదండ జడలదండను, వేదండఁ జెలంగఁ జెరివి వేదండగతిన్
వేదండముచే వీచుచు, నాదండధరారిపోలె నాడుచు వచ్చెన్.[4]

136


వ.

అట్టియెడ దేవేంద్రుండు నైరావతారూఢుండై దేవగంధర్వకిన్నరసిద్ధవిద్యాధర
పతులు గొలువ నాకలోకబాహ్యంబున వాహ్యాళిగా వెడలి విహరించుచున్న
సమయంబున దుర్వాసుండు దుర్వారగర్వంబున గీర్వాణవిభునిపాలికిం బోయి
నీలకంధరజటామకుటమండితం బైనశశాంకరేఖయుంబోలెఁ దనజడలలోపలి
మందారకుసుమదామంబుఁ గైకానుకఁగా నొసంగి దీవించిన నతం డంకుశంబున
నందుకొని.[5]

137
  1. వాసవ.. సౌరభ్యములు = ఇంద్రునియుద్యానవనమునందలిదియు యింపైనదియు ఘనమైనదియు చేతపట్టుకోఁబడినదియునైన పూదండవలని పరిమళములు, సకల .... మహిమలు = ఎల్లదిక్కులను నిండిన ప్రతిలేనిమాహాత్మ్యములు, సంధిల్లఁగాన్ = కలుగఁగాన్, కొంచున్ తీసికొని, ఏతే
    రంగు = రాఁగా, దౌదవ్వులన్ = కడుదూరమునందు.
  2. శర.. స్ఫూర్తిమైన్ = శరత్కాలమునందలి చంద్రరేఖను (రేఖాకారమైన బాలచంద్రుని ) సంగ్రహించుటవలని ప్రకాశముతో, విభావరీసతి= రాత్రి యనెడు స్త్రీవలె, కల్పద్రు... దామము = కల్పవృక్షమునందలి వాడనిపూవులచేత కట్టఁబడిన ఒప్పిద మైనసరమును, యథేచ్ఛన్ = స్వేచ్ఛగా, వినుత...బింబాధరిన్ = పొగడఁదగినమన్మథక్రీడావ్యాపారముయొక్క గౌరవము జనించిన (తోఁచుచున్న) దొండపండువంటి అధరము గలది.
  3. మదిరాక్షిచేన్ = మైకమును తోఁపించునట్టిమాపుతోడి కన్నులుగలదియైన ఆవిద్యాధరస్త్రీచేత, బెడంగడరెడు = అంద మతిశయించుచున్న, ప్రియమారఁగ = ఇష్టము పూర్తికాఁగా - మిక్కిలియిష్టముతో, సన్న = సంజ్ఞ, చయ్యనన్ = తటాలున, బారికిన్ = వశమునకు.
  4. జడలదండను = జడలవెంబడి - జడలలో, వేదండ = (వేదు, అండన్) చెమటకంపుతోడ, చెరివి = తుఱిమి, వేదండగతిన్ = ఏనుఁగునడకవంటినడకతో, వేదండముచేన్ = ఏనుఁగుతొండమువంటి చేతిని, వీచుచు = ఊచుకొనుచు.
  5. ఐరావతారూఢుఁడు = ఐరావతమనుఏనుఁగు నెక్కినవాఁడు, నాకలోకబాహ్యంబునన్ = న్వర్గలోకమునకు వెలుపల, వ్యాహ్యాళిగా = షికారుగా, దుర్వార = అణఁపఁగూడని, గీర్వాణవిభునిపాలికిన్ = ఇంద్రునియొద్దకు, నీలకంధరజటామకుటమండితంబు = శివునిజడముడియందు అలంకరింపఁబడినది, శశాంశరేఖ = చంద్రరేఖ, మందారకుసుమధామంబు = కల్పవృక్షపుపువ్వులదండ, కైకానుక = చేతికియ్యఁబడిన కానుక.