పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బునఁ జింతింప నిజాంకదేశమున నుద్భూతంబునుం బొందె లో
కనుతుం డప్పుడు నీలలోహితుఁ డనంగాఁ బుత్రుఁ డత్యున్నతిన్.

120


ఆ.

పుట్టి తనకుఁ బేరు పెట్టు మటంచు నా, నలువయెదుర రోదనంబు నేయ
రోదనంబుకతన రుద్రుండ వీ వని, నీరజాసనుండు పేరువెట్టె.

121


వ.

వెండియు నతం డేడుమాఱు లెలుంగెత్తి యేడ్చిన వారించి యతనికి భవుండును
శర్వుండును మహేశ్వరుండును పశుపతియు భీముండును నుగ్రుండును మహాదే
వుండు ననునామధేయంబులు సేసి రుద్రావ్యష్టనామసహితుం డైనయతనికి సూ
ర్యజలపృథ్వీపవనవహ్నిగగనదీక్షితచంద్రులను శరీకంబులుగా నొనర్చి యాసూ
ర్యాదులకు సువర్చలోషాసుకేశీశివాస్వాహాదిగ్దీక్షారోహిణులం గ్రమంబునఁ బ
త్నులం గావించె మఱియును.[1][2]

122


క.

హిమగిరికిని మేనకకును, బ్రమదంబుగఁ బుట్టినట్టిపరమేశ్వరి యా
దిమశక్తి గౌరిసతియై, యమరెఁ జుమీ యష్టమూర్తి యగురుద్రునకున్.[3]

123


ఆ.

ఖ్యాతియందు భృగుఁడు ధాతృవిధాతృలు, నాఁగ సుతుల లక్ష్మి నాఁగఁ గూఁతు
నర్థితోడఁ గాంచి యట్టిమహాలక్ష్మి, బ్రియముతోడ హరికిఁ బెండ్లి సేసి.[4]

124


వ.

అనిన విని మైత్రేయుం డిట్లనియె.[5]

125

క్షీరసముద్రపుత్రి యని ప్రసిద్ధినొందియున్న లక్ష్మీదేవి భృగుపుత్రి యెట్లయ్యె ననుశంకను పరిహరించుట

క.

భృగుకన్యక యని లక్ష్మిని, దగఁ జెప్పితి వంబురాశితనయ యటంచున్
జగమెల్లఁ జెప్ప విందుము, జగదేకస్తుత్య యేమిచందం బనినన్.

126


వ.

పరాశరుఁ డతని కిట్లనియె. సర్వభూతమయుం డైనవాసుదేవుని మాయాశక్తి
లక్ష్మీరూపంబున నతనికి సహాయయై విహరించుం గావున జగంబులకు సంపత్క
రంబు లైనపరికరంబు లెన్ని గల వన్నియును శ్రీచిహ్నంబు లనిచెప్పి మఱియు
నిట్లనియె.[6]

127


సీ.

బోధబుద్ధులు శైలభూములు ధర్మక్రియలు స్రష్టృసృష్టులు జలధివేల
లును దినయామినులును హుతాగ్నిస్వాహలును శంకరాంబికలును దినేశ్వ
రప్రభలును మఘప్రాగ్వంశశాలలు శ్రీపతిశ్రీలును యూపచితులు
సామగీతులు సుధాధామశాంతులు నిధ్మదర్భలు మఱి యజ్ఞదక్షిణలును

  1. అష్టమూర్తి యనునభిధానంబు చేసె మఱియును - అని పాఠాంతరము.
  2. దీక్షితుఁడు = యజమానుఁడు.
  3. ప్రమదంబుగన్ = సంతోషముగా.
  4. నాఁగన్ = అనఁగా.
  5. భృగుకన్యక = భృగువుకూఁతురు, అంబురాశితనయ = సముద్రునికూతురు, జగదేకస్తుత్య = లోకమునందు ఒక్కఁడవయి స్తుతింపఁదగినవాఁడా.
  6. సంపత్కరములు = సంపదను కలుగఁ జేయునవి, పరికరంబులు = ఉపకరణములు, చిహ్నములు = గుఱుతులు.