పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నిటలాక్షుఁడు రుద్రుఁడు ప్ర, స్ఫుటమధ్యాహ్నర్కుఁబోలెఁ బుట్టె మునీంద్రా.[1]

111


వ.

ఇ ట్లర్ధనారీసహితుండును ప్రచండదేహుండును నై తనయం దుద్భవించినరు
ద్రునివలన వెండియు నట్టిరూపంబులు పది జన్మించె నవి స్త్రీపురుషభావంబులును
సౌమ్యాసౌమ్యంబులును శాంతాశాంతంబులును శ్యామధవళవర్ణంబులును నై
వెలయ వా రేకాదశరుద్రు లైరి మఱియును.[2]

112


క.

అంభోరుహగర్భుఁడు పటు, గాంభీర్యప్రాభవములు గల్గినమతితో
డింభకుఁ బుట్టించెను స్వా, యంభువుఁ దనవంటివాని నాదిమమనువున్.[3]

113


క.

ఆతఁడు విమలతపోని, ర్ధూతమహాకలుష యైనతొయ్యలిఁ బుణ్యో
పేతను శతరూప నతి, ప్రీతిఁ బ్రజావృద్ధి కొఱకుఁ బెండిలి యయ్యెన్.[4]

114


తే.

ఆవధూవరులందుఁ బ్రియవ్రతుండు, నాఁగ నుత్తానపాదుండు నాఁగ నిరువు
(?)రాత్మజులుఁ బ్రసూతి యకూతి యనఁ గన్య, కాద్వయంబుఁ బుట్టె గరిమతోడ.[5]

115


క.

ఆతరలాక్షులయందుఁ బ్రసూతిని దక్షుఁడు వరించె సుందరి యగునా
కూతిని రుచికుఁడు పరిణయ, మై తనరెను వారియందు యజ్ఞుఁడు పుట్టెన్.[6]

116


క.

ఆయజ్ఞుఁడు దక్షిణయం, దాయతమతి నర్కసంఖ్యయాములఁ బడసెన్
స్వాయంభువమనుకాలం, బాయాములు దేవగణము లైరి మహిమతోన్.

117


క.

దక్షునకు సకలవిద్యా, దక్షునకుఁ బ్రసూతికిని ముదంబున జలజా
తేక్షణ లిరువదినలువురు, దాక్షాయణు లుదయమైరి తాపసముఖ్యా.[7]

118


వ.

వారియందు శ్రద్ధయు లక్ష్మియు ధృతియు తుష్టియు పుష్టియు మేధయు క్రియ
యు బుద్ధియు లజ్జయు వపువును శాంతియు సిద్ధియుఁ గీర్తియు ననుపదుమువ్వు
రను ధర్ముండు వరియించె. ఖ్యాతియు సతియు సంభూతియు స్మృతియు ప్రీతియు
క్షమయు సన్నతియు నససూయయు నూర్జయు స్వాహయు స్వధయు ననుపదు
నొక్కండఁ గ్రమంబున భృగుండును భవుండును మరీచియు నంగిరసుండును
పులస్త్యుండును పులహుండును గ్రతువు నత్రియు వసిష్ఠుండును వహ్నియుఁ
బితృదేవుండును వరించిరి. మఱియును.

119


మ.

అనురాగం బొదవం బితామహుఁడు కల్పారంభకాలంబునం
దనతోడన్ సరియైనపుత్రకుని నుత్పాదింతు నంచున్ ముదం

  1. జటిలభ్రూకుటి = వంకరైనబొమముడి కలవాఁడు, తన్నిటలస్థలియందు = అతనినొసటిప్రదేశమునందు, నిటలాక్షుఁడు = నొనట కన్ను గలవాఁడు, ప్రస్ఫుటమధ్యాహ్నార్కుఁబోలెన్ = చక్కఁగా వెలుఁగుచున్న పట్టపగటిసూర్యునివలె.
  2. అర్థనారీసహితుఁడు = సగము ఆఁడరూపముతోఁ గూడుకొన్నవాఁడు, సౌమ్యాసౌమ్యములు = తిన్నఁదనమును బెట్టిదమును గలవి, శ్యామధవళవర్ణంబులు = నలుపును తెలుపునైన వర్ణములు గలవి.
  3. గాంభీర్యము = గంభీరత, ప్రాభవము = ప్రభుత్వము, డింభకునిన్ = బిడ్డలి, ఆదిమమనువున్ = మొట్టమొదటిమనువును.
  4. విమలతపోనిర్ధూతమహాకలుష = నిర్మలమైన తపస్సుచేత తొలఁగఁగొట్టఁబడిన గొప్పపాపములు గలది, తొయ్యలిన్ = స్త్రీని, పుణ్యోపేత = పుణ్యముతోఁ గూడుకొన్నవానిని.
  5. గరిమతోడన్ = గురుత్వముతో.
  6. పరిణయమై = పెండ్లాడి.
  7. సకలవిద్యాదక్షునకున్ = ఎల్లవిద్యలయందు సమర్థుఁడైనవానికి.