పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


న్వంతరములు పదునాలుగు, సంతతమును జెల్లుచుండు సరియై యెందున్.[1]

67


క.

ఒక్కొక్కమనువు డెబ్బది, యొక్కమహాయుగము లింతయును నేలు సుధా
భుక్కులము మునులు నింద్రులు, నక్కాలమునందు మనువులట్ల మునీంద్రా.[2]

68


ఆ.

మనువు మనువు మాని మనువు వచ్చినదాఁక, నంబురాసు లేకమై చెలంగు
నట్టిప్రళయకాల మాదియుగమా, ణాబ్దకాల మయ్యె ననఘచరిత.[3]

69


క.

వినుము పితామహుదివసం, బును సృష్టియు రాత్రి ప్రళయమును బాటిల్లున్
మునివర యిది నైమిత్తిక, మనుకల్పం బిట్ల చెల్లు ననవరతంబున్.

70


క.

ఇట్టిదినంబులు ముప్పది, నెట్టనఁ బద్మజున కొక్కనెల యట్టినెలల్
గట్టిగఁ బండ్రెండగు సమ, మట్టిసమలు నూఱు బ్రహ్మయాయుస్సు చుమీ.

71


తే.

అది మహాకల్పమై చెల్లు నంబుజాత, భవునిప్రథమపరార్ధంబు పద్మకల్ప
మగు ద్వితీయపరార్ధంబు దగు వరాహ, కల్ప మిప్పాట వర్తిల్లుఁ గాలగతులు.[4]

72


క.

కల్పాదులఁ బరమేష్ఠి య, నల్పీకృతసత్వయుక్తుఁడై లోకంబుల్
కల్పించును నారాయణ, కల్పంబగు దివ్యమూర్తిఁ గైకొని గరిమన్.[5]

73


క.

అనవుడు మైత్రేయుం డి, ట్లనుఁ గల్పాదిని బయోరుహాసనుఁ డేలా
గున లోకము సృజియించెను, మునుకొని నారాయణత్వమున సాత్వికుఁడై.[6]

74

శ్రీమన్నారాయణుండు వరాహరూపంబు నొంది సముద్రమగ్నం బైయున్నభూమిని నుద్ధరించుట

వ.

అనిన నతం డిట్లనియె నతీతకల్పావసానకాలంబున నిశాకాలనిద్రాప్రబుద్ధుం
డైనబ్రహ్మదేవుండు పరమసాత్వికుండును నారాయణధ్యానసమాధానమానసం
డును నై పరమశూన్యం బైనలోకం బాలోకించి తొల్లింటిమత్స్యకూర్మావతా
రంబులచందంబున మహావరాహరూపంబు ధరియించి యగాధం బైనపాథోని
ధానంబున మునింగినవసుంధర నుద్ధరింపం దలంచి యమ్మహార్ణవంబుఁ బ్రవేశించి.[7]

75


శా.

భూదారాధిపుఁ డుగ్రఘుర్ఘురరవంబుల్ నింగిఁ బొంగార హే

  1. ఘస్రము = పగలు.
  2. సుధాభుక్కులము = దేవతాసమూహము.
  3. మనువు మాని = జీవితకాలము పోయి - గతించి.
  4. ఇప్పాటన్ = ఈచొప్పున, వర్తిల్లు = ఉండును.
  5. పరమేష్ఠి = బ్రహ్మ, అనల్పీకృతసత్వయుక్తుఁడై = అధికముగాఁ జేయఁబడిన సత్వగుణముతోఁ గూడినవాఁడై, కల్పించున్ = సృజించును, నారాయణకల్పము = నారాయణమూర్తితో తుల్యము, గరిమన్ = గురుత్వముతో - మహిమతో.
  6. పయోరుహాసనుఁడు = బ్రహ్మ, సాత్వికుఁడై = సత్వగుణయుక్తుఁడై.
  7. అతీతకల్పావసానంబునన్ = కడచిన కల్పము ముగిరయకముందు, నిశాకాలనిద్రాప్రబుద్ధుండు = రాత్రికాలమునందలి నిద్రవలన మేలుకొన్నవాఁడు, ఆలోకించి = చూచి, ఆగాధము = మిక్కిలి లోఁతుగలది, పాథోనిధానంబునన్ = సముద్రమునందు, వసుంధరన్ =భూమిని, ఉద్ధరింపన్ = మీఁది కెత్తను, మహార్ణవము = గొప్పసముద్రము.